Site icon vidhaatha

Life Insurance: ఐసీఐసీఐ ఇన్సూరెన్స్‌.. కొత్త పథకం! ఓవైపు పొదుపు.. మ‌రో వైపు ఆదాయం

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులతో దేశీయంగా ఉత్పత్తి, అమ్మకాల కొనుగోళ్లు విపరీతంగా ప్రభావితమవుతున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణంతో పెరిగిన ధరలు సామాన్యులకు కంటగింపుగా మారాయి. దీంతో వారంతా పొదుపు మార్గాల వైపు అన్వేషిస్తున్నారు. వారి కలలను సాకారం చేసేలా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోనూ కంపెనీలు పొదుపు పథకాలను తీసుకొస్తున్నాయి.

తాజాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నయా పొదుపు పథకాన్ని ఆవిష్కరించింది. సంపదను కాపాడుకుంటూ, ఆదాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని రూపొందించినట్లు సంస్థ చెబుతోంది. “కస్టమర్లు తమ దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను నిశ్చయంగా సాధించడంలో సహాయపడటమే మా లక్ష్యం” అని ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ శ్రీ అమిత్ పాల్టా అన్నారు. పెరుగుతున్న ఆదాయ లక్షణం, ఏటా 5% చొప్పున సమ్మేళనం చేయడం, ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపయోగ పడుతుందని చెప్పారు. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ డిజిటల్ ఆవిష్కరణలతో జీవిత బీమా పంపిణీ శైలిని కూడా మారుస్తోంది.

ఏఐతో పరిష్కారం..

IPRU ఎడ్జ్ మొబైల్ యాప్ ద్వారా ఏజెంట్లకు సాధికారత కల్పిస్తోంది. “కస్టమర్లు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారు. IPRU Edgeతో వారికి ఉపయోగపడేలా డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకొచ్చాం” అని పాల్టా వివరించారు. మొబైల్ యాప్ వ్యాపార లీడ్‌లు, సోషల్ మీడియా మార్కెటింగ్ కంటెంట్, పేపర్‌లెస్ కొనుగోళ్లను అందిస్తుంది. ఆయా ఏజెంట్లు వ్యాపార వృద్ధిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఏప్రిల్ – డిసెంబర్ 2024 మధ్య, IPRU Edgeని ఉపయోగించే ఏజెంట్ల ఉత్పాదకత 25% పెరిగింది. కృత్రిమ మేధతో(AI) కంపెనీ దాదాపు 50% పొదుపు పాలసీలను ఒకే రోజున జారీ చేసింది.

Exit mobile version