Site icon vidhaatha

Bandi Sanjay | రిమాండ్‌ రద్దు కోరుతూ.. సంజయ్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

విధాత: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కుట్రలో సూత్రధారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) పై పోలీసులు అభియోగం మోపారు. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా చేర్చారు.

నిన్న ఆయనను హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ నివాసానికి తీసుకుళ్లి హాజరుపరిచారు. పూర్వపరాల అనంతరం మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ.. సంజయ్‌ తరఫున లాయర్లు అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరిపేందుకు హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అంగీకరించారు.

Exit mobile version