Site icon vidhaatha

MadhyaPradesh | డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తు.. వంతెన పైనుంచి బ‌స్సు బోల్తా.. 22 మంది మృతి

MadhyaPradesh |

విధాత: మధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇండోర్ వైపు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు ఖ‌ర్‌గావ్ జిల్లాలో బ్రిడ్జ్ మీద ప్ర‌యాణిస్తుండ‌గా అదుపు త‌ప్పి కింద ప‌డిపోయింది.

ఈ ప్ర‌మాదంలో క‌నీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు బాల‌లు, 10 మంది మ‌హిళ‌లు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం 31 మంది గాయాల‌పాలై ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

న‌ది ఎండి పోయి ఉండ‌టంతో ప్ర‌మాద తీవ్ర‌త కాస్త త‌గ్గిన‌ట్లు స్థానికులు తెలిపారు. బ‌స్సు డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తుతో నియంత్ర‌ణ కోల్పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ఘోరం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Exit mobile version