Site icon vidhaatha

Mumbai-Pune Expressway Accident | ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..భారీగా ట్రాఫిక్ జామ్

mumbai-pune-expressway-accident-traffic-jam

Mumbai-Pune Expressway Accident | న్యూఢిల్లీ: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా..18మంది గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ఏకంగా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. శనివారం మధ్యాహ్నం ముంబై పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వస్తున్న కంటైనర్ ట్రైలర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్ రోడ్డుపైన వెలుతున్న బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్లతో సహా కనీసం 20 వాహనాలను ఢీకొట్టాడు. దీని ఫలితంగా ఒక మహిళ మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖలాపూర్ తాలూకాలోని ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడోషి టన్నెల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. గాయపడిన వారికి సహాయం చేయడానికి, శిథిలాలను తొలగించడానికి అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేలలో ఈ హైవే కూడా ఒకటి. ఇక్కడ రోజువారీగా 1.5 నుండి 2 లక్షల వాహనాలు వెలుతుంటాయి. వారాంతాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రమాదం కారణంగా దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించడంతో వందలాది వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

ప్రమాదంలో గాయపడిన బాధితులను నవీ ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. “వీరిలో ఒక మహిళ చికిత్స పొందుతూ మరణించింది” అని తెలిపారు. “డ్రైవర్‌ను ఖోపోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సంఘటన జరిగిన సమయంలో అతను మద్యం మత్తులో లేడని వైద్య పరీక్షలో తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Exit mobile version