Site icon vidhaatha

CM Revanth Reddy| 37చేరిన సిగాచీ పేలుడు మృతులు.. ప్రమాద స్థలికి సీఎం రేవంత్ రెడ్డి

విధాత : సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ కెమికల్ ప్యాక్టరీలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 37కు చేరింది. మరో 33క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాద మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాద అనంతరం 57మంది కార్మికులు ఇళ్లకు చేరుకోగా..33మంది చికిత్స పొందుతున్నారని..47మంది ఆచూకీ లభించలేనందునా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని..మరికొందరు శిధిలాల కింద చనిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో కడపలోని జమ్మలమడుగుకు చెందిన నవదంపతులు కూడా మరణించారు. వారికి నెల రోజుల క్రితమే పెళ్లవ్వగా..దంపతులిద్దరు సిగాచీ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూన్నారు. వారిద్దరి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను గుర్తుపట్టే పరిస్థితి లేకపోవడంతో డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాక 10మంది మృతులను గుర్తించారు.

ఫ్యాక్టరీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

పేలుడు ఘటన జరిగిన సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, డి.శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామిలు కూడా ఉన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి అక్కడే అధికారులు, కంపెనీ ప్రతినిధులతో సమీక్ష చేశారు. ఘటనపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమకు అనుమతులు, భద్రత ప్రమాణాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవర అని సీఎం ప్రశ్నించారు. వారు పేలుడుకు చెబుతున్న సమాధానాలేమిటి..బాధితుల కోసం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. పరిశ్రమను తనిఖీ చేశారా అని ఫ్యాక్టరీస్ డైరెక్టర్ ను ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. సిగార్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై కొత్త సభ్యులతో విచారణ కమిటీ చేసి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రమాద స్థలానికి కంపెనీ యాజమాన్యం రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు తక్షణ సహాయంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 1లక్ష చొప్పున సహాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ. 50,000 చొప్పున అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు వారి వైద్య ఖర్చులను భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Exit mobile version