Jangaon | వల్మిడిలో.. వైభవంగా సీతారాముల విగ్రహ పునః ప్రతిష్టాపన

Jangaon | హాజరైన రాష్ట్ర మంత్రులు, చిన్న జీయర్ స్వామి వల్మిడిలో భక్తజన సందోహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం సీతారామచంద్ర స్వామి విగ్రహాల పునః ప్రతిష్టాపన పూజలు వైభవంగా నిర్వహించారు. దేవాలయ పునః ప్రారంభోత్సవంలో చిన్నజీయర్ స్వామితో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అతిథులుగా హాజరయ్యారు. విగ్రహ పునః ప్రతిష్టాపన పూజల్లో భాగస్వామ్యం […]

  • Publish Date - September 4, 2023 / 01:45 PM IST

Jangaon |

  • హాజరైన రాష్ట్ర మంత్రులు, చిన్న జీయర్ స్వామి
  • వల్మిడిలో భక్తజన సందోహం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం సీతారామచంద్ర స్వామి విగ్రహాల పునః ప్రతిష్టాపన పూజలు వైభవంగా నిర్వహించారు. దేవాలయ పునః ప్రారంభోత్సవంలో చిన్నజీయర్ స్వామితో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అతిథులుగా హాజరయ్యారు.

విగ్రహ పునః ప్రతిష్టాపన పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. నాలుగు రోజులుగా వల్మిడిలో ప్రతిష్టాప, కళ్యణోత్సవం అత్యంత వైభవంగా చేపట్టారు. గ్రామ ప్రజలతో పాటు పరిసరాల్లో ఉన్న గ్రామీణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో జనగామ జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఈ ఉత్సవాలను విజయ వంతం చేసింది. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో అతి పురాతన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి విగ్రహాలను పునఃప్రతిష్టించారు. రామాయణం రాసిన వాల్మీకి పుట్టిన గడ్డగా వల్మిడికి ఈ పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, కోడూరు కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కార్య నిర్వహణ అధికారిణి లక్ష్మీప్రసన్ పాల్గొన్నారు. కాగా పాలకుర్తి గ్రామాలలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Latest News