KCR
విధాత: ప్రజల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చిందని, తమ పోరాటంలో నిజాయితీ ఉంటే విజయం దానంతట అదే సిద్ధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు(KCR) అన్నారు. దేశంలో మార్పు జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఆఫీసును ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్.. అది కిరాయి ఆఫీసులలో కాదని, సొంతగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే ఐదేండ్లలోనే ఇంటింటికీ ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగే నీటినే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, గోండు ప్రజలు కూడా తాగుతున్నారని, ఇక్కడ కూడా ఇంటింటికీ నీళ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ‘ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. ఉచిత కరెంట్ ఇస్తాం. రైతులను ఆదుకుంటాం’ అని ప్రకటించారు. తాగేందుకు నీరు లేదు.. యువతకు ఉద్యోగాల్లేవని చెప్పారు. కావాల్సిన దాని కంటే రెట్టింపు నీరు పుష్కలంగా ఉందని తేల్చి చెప్పారు.
మహారాష్ట్ర పవిత్ర భూమికి నమస్కారం అంటూ ఉపన్యాసం ప్రారంభించిన కేసీఆర్.. అందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ కు ఒకే లక్ష్యం ఉందని చెప్పారు. ఇప్పుడు తాను చెప్పే మాటలను ఇక్కడే మర్చిపోవద్దని, మీ మీ గ్రామాలకు వెళ్లి మీ ఇంట్లోని వారితో, మీ స్నేహితులతో చర్చించాలని కోరారు.
BRS President, CM Sri KCR addressed a massive public meeting at Aurangabad in Maharashtra today.#BRSParty #KCR pic.twitter.com/FPjCC31Wcm
— BRS Party (@BRSparty) April 24, 2023
ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించండని కోరారు. దేశం ఉండాల్సిన స్థితిలో ఉన్నదా లేదా అనే అంశంపై చర్చ పెట్టాలని విన్నవించారు. ‘ఇప్పటికీ సాగు, తాగు నీరు అందడం లేదు. సాగు, తాగు నీరు అందకపోవడం ఎవరి పాపం? గోదావరి, కృష్ణా, పెన్ గంగా వంటి నదులు ఉన్నా మహారాష్ట్రకు నీటి కష్టాలెందుకు..? ముంబై దేశ ఆర్థిక రాజధాని, కానీ తాగేందుకు నీళ్లుండవా..? దేశం పురోగమిస్తుందా..? తిరోగమిస్తుందా..? ఆలోచించండి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది.. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి’ అని కేసీఆర్ అన్నారు.
దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. మార్పు జరగాలని చెప్పారు. ఒక పార్టీ గెలిస్తే.. మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదన్న కేసీఆర్.. ఎవరు గెలిచినా సమస్య అపరిష్కృతంగానే ఉంటున్నదని గుర్తు చేశారు. పార్టీలు గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు ఆకాంక్ష గెలవడం ముఖ్యమని నొక్కి చెప్పారు.
దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, యువత ఎంత త్వరగా మేల్కొంటే.. అంత తర్వగా బాగుపడుతామని అన్నారు. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని, పరివర్తన రానంత కాలం ఈ దేశం ఇలాగే కూనరిల్లుతుందని చెప్పారు. ప్రపంచాన్ని శాసించే స్థితికి చైనా చేరిందని, సింగపూర్, కొరియా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
ఔరంగాబాద్, అకోలలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని కేసీఆర్(KCR) అన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారికి తాగునీటి సమస్య కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా..? ఇంటికి పంపించాలా..? అనే విషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత ఆలోచించాలని కోరారు. సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిది..? లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? అని నిలదీశారు. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని చెప్పారు.
దేశంలో యువశక్తి ఉందని, దేశంలో కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ చెప్పారు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని చెబుతూ.. ‘ఇదంతా మన కళ్లముందే జరుగుతోంది. ఇది ఇలాగే జరగాలా..? చికిత్స చేయాలా..? ఆలోచించండి. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. దేశంలో మార్పు రావాల్సిందే’ అని చెప్పారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్.https://t.co/OJRuuMp5mB pic.twitter.com/oXDsLV1tHw
— BRS Party (@BRSparty) April 24, 2023
కొత్త పార్టీ అనగానే కొందరు అపవాదులు సృష్టిస్తారని కేసీఆర్ చెప్పారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ పై నమ్మకం ఉంచాలని కోరారు. ‘ఒకకులం, మతం, వర్గం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించలేదు. దేశంలో మార్పు తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ ఏర్పడింది. మార్పు వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతూ ఉంటుంది. అన్ని వర్గాల వారికి సరైన న్యాయం దక్కాల్సిందే. మార్పు రాకుంటే దేశం ముందుకు వెళ్లదు. మార్పును తీసుకు వచ్చేందుకే బీఆర్ఎస్ పుట్టింది’ అని ఆయన ఉద్ఘాటించారు.
‘తెలంగాణలో మంచినీటి సమస్య లేకుండా చేశాం. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు పావుగంటలో అవుతున్నాయి. సాగునీరు అందిస్తున్నాం. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో ప్రతీ ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నాం. రైతు చనిపోతే బీమా కల్పిస్తున్నాం.
మరి మహారాష్ట్రలో ఇవి ఎందుకు అమలు కావడం లేదు?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. పరిష్కారం కోసం ఇంకెంత కాలం చూడాలని అన్నారు. సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో కేసీఆర్ కు ఏం పని? అని ఫడ్నవీస్ అంటున్నారన్న కేసీఆర్(KCR).. తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకొస్తే తానెందుకు వస్తానని ఎదురు ప్రశ్నించారు.
’మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు చేయ్.. 24 గంటల కరెంట్ ఇవ్వండి. రైతుబంధు, రైతుబీమా కల్పించండి.ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను’ అని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా..? అని నిలదీశారు. దళితబంధు లాంటి పథకం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరని నిలదీశారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించే పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
’కిన్ ఇండియా అంటారు.. నగరంలో వీధి వీధికో చైనా బజార్ ఉంటది. డిజిటల్ ఇండియా మజాక్ అయింది.. మేకిన్ ఇండియా జోక్ అయింది. మహారాష్ట్రలో మంత్రులు కేబినెట్ ఉంటుంది.. కానీ చీఫ్ సెక్రటరీ ఎందుకు ఉండరు..? పెద్ద రాష్ట్రమని చెప్పుకునే మహారాష్ట్రలో చీఫ్ సెక్రటరీ ఉండరా..? అని కేసీఆర్ ప్రశ్నించారు