IJU Warangal : ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్

నూతనంగా ఎన్నికైన ఐజేయూ (IJU) నేషనల్ కౌన్సిల్ సభ్యులు, టీయూడబ్ల్యూజే-ఐజేయూ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఘనంగా సత్కరించింది.

విధాత, వరంగల్ ప్రతినిధి: నూతనంగా ఎన్నికైన ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సత్కరించారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన శనివారం జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టులు సంగోజు రవి, గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకటరమణ,తోట సుధాకర్ TUWJ-IJU వరంగల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన శ్రీరాం రాంచందర్,మట్ట దుర్గాప్రసాద్ లను శాలువాలతో సత్కరించి మెమోంటో లు అందించి సన్మానించారు.

నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసుకున్న నల్లాల బుచ్చిరెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్యలు మాట్లాడుతూ యూనియన్ బలోపేతం కోసం పనిచేస్తున్న నేతలకు పదవులు రావటం అభినందనీయమని అన్నారు. ఐజేయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విరహత్ అలీ, రాంనారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో జర్నలిస్టుల అభ్యున్నతి కోసం కోసం పనిచేస్తున్న యూనియన్ TUWJ-IJU మాత్రమేనని అన్నారు. క్లబ్ లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి బోల్ల అమర్,ఉపాధ్యక్షుడు కొడిపెల్లి దుర్గాప్రసాదరావు, జాయింట్ సెక్రెటరీలు వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్థన్,కార్యవర్గ సభ్యులు ఎండీ నయీంపాషా,విజయరాజ్, ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, నేతలు సోమనర్సయ్య, రాజేంద్రప్రసాద్,సంపత్ రావు,పాషా,తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Telangana Sarpanch Election : కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
Sand Vipers : ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!

Latest News