విధాత : పాములలో ఏడారి వైపర్లు వింత జీవనశైలితో ఆకట్టుకుంటాయి. ఎక్కువగా ఇరాన్, మెక్సికో, అమెరికా నైరుతి, సహారా ఎడారులలో కనిపించే ఇసుక వైపర్లు(Sand Vipers) ఆహారాన్ని వేటాడేందుకు, శతృవుల నుంచి తప్పించుకునేందుకు వేసే ఎత్తులు చూస్తే..వాటి తెలివికి ఆశ్చర్యపోవాల్సిందే. వీటిని ఇసుక పింజరిగా పిలుస్తారు. ఒంటరిగా సంచరించే సహారా ఇసుక వైపర్లు అకస్మాత్తుగా తమను తాము ఇసుకలోకి పాతిపెట్టుకుంటుకుని దాక్కుంటాయి. తమ ఎర దగ్గర వచ్చేందుకు, లేదా శతృవు నుంచి తప్పించుకునేందుకు అవి అలా చేస్తుంటాయంటారు. అంతేకాదు ఎక్కువగా ఉంటే ఎడారి ఎండ తీవ్రతను తప్పించుకునేందుకు..పగటి పూట చల్లదనం కోసం ఇసుకలో దాక్కుంటాయని నిపుణుల కథనం. బూడిద లేదా ఎరుపు-గోధుమ రంగులో..శరీరంపై ముదురు రంగు గీతలతో ఉండే ఇసుక వైపర్లు ఎడారిలో మనిషి కంటికి తొందరగా గుర్తించలేని ఆకృతిలో ఉంటాయి
ఎడారి ఇసుక వైపర్లు సాండ్ వైపర్(డైమాండ్ బ్యాక్ స్నేక్), సైడ్ వైండర్ రాటిల్ స్నేక్, హార్న్డ్ వైపర్ వంటి మూడు రకాలుగా ఉన్నాయి. అవి విషపూరితమైనవి. వీటిలో సైడ్ వెండర్ రాటిల్ స్నేక్ 29కిలోమీటర్ల వేగంతో తను వేటాడాలనుకున్న జీవిపైకి దాడిచేస్తుంది. ఎడారి ఇసుక వైపర్లు వృత్తాకారంలో తిరుగుతూ పాకడం వింతగా కనిపిస్తుంటుంది. ఎడారి ఇసుక పాములు భయాందోళనకు గురైనప్పుడు “సి” ఆకారంలో చుట్టుకొని, వాటి పొలుసులను ఒకదానితో ఒకటి రుద్దుతూ కరకరమనే శబ్దాన్ని చేస్తుంటాయి. సాండ్ వైపర్లు ఎక్కువగా చిన్న బల్లులు, కీటకాలు,కప్పలు, ఎలుకలు, చిన్న పక్షులను తింటుంటాయి.
పాములలో నాగుపాము, కట్లపాము, రక్త పింజరి, ఇసుక పింజరి అత్యంత విషపూరితం, ప్రమాదకరం కూడా. ఇవి కాటు వేస్తే, ఆ విషయం తెలియగానే సగం ప్రాణం పోతుంది. నాగుపాము కాటువేస్తే ఆరగంట నుంచి 2 గంటల్లో మనిషి చనిపోతారు. అదే కట్లపాము కాటువేస్తే, 6 నుంచి 48 గంటల్లో చనిపోతారు. అదే రక్త పింజరి కాటువేస్తే 12 నుంచి 24 గంటల్లో మనిషి చనిపోతారు. అదే ఇసుక పింజరి కాటువేస్తే 12 నుంచి 24 గంటల్లో మనిషి చనిపోతారు. చనిపోయేలోపు యాంటీ-వెనమ్ ఇంజెక్షన్ ఇస్తే, బతికే అవకాశాలు ఉంటాయి.
Saharan Sand Viper burrowing into the sand 🐍 pic.twitter.com/2FvcZBi2l6
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 6, 2025
ఇవి కూడా చదవండి :
Dharma Mahesh | కొత్త బిజినెస్‌లో ఆ హీరో సెన్సేషన్ .. పేరు ఆ లెటర్‌తో మొదలైతే చికెన్ మండీ ఫ్రీ
China Longest Airlines : ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
