Python | అది లేకుండానే కొండ‌చిలువ పిల్ల‌ల‌ను కంట‌ది..! ఇంకెన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు..!!

Python | కొండచిలువ‌లు.. జంతు రాజ్యంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన స‌రీసృపాలు ఇవి. పైథోనిడే కుటుంబానికి చెందిన పైథాన్.. అతిపెద్ద స‌రీసృపాల జాతుల్లో ఒక‌టి. ఈ కొండచిలువలు.. జింక‌లు, పందులు, మొస‌ళ్ల‌తో పాటు మ‌న‌షుల‌ను అమాంతం మింగేస్తాయి.

  • Publish Date - June 13, 2024 / 11:10 AM IST

Python | కొండచిలువ‌లు.. జంతు రాజ్యంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన స‌రీసృపాలు ఇవి. పైథోనిడే కుటుంబానికి చెందిన పైథాన్.. అతిపెద్ద స‌రీసృపాల జాతుల్లో ఒక‌టి. ఈ కొండచిలువలు.. జింక‌లు, పందులు, మొస‌ళ్ల‌తో పాటు మ‌న‌షుల‌ను అమాంతం మింగేస్తాయి. 180 డిగ్రీల వ‌ర‌కు కొండ‌చిలువ‌లు త‌మ ద‌వ‌డ‌ల‌ను తెర‌వ‌గ‌ల‌వు. దీంతో ఇత‌ర జంతువుల‌ను మింగేందుకు చాలా ఈజీ. అయితే భయంక‌ర‌మైన కొండ చిలువ‌ల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

32 అడుగుల వ‌ర‌కు పెరుగుతాయి..

కొండ‌చిలువ‌లు త‌మ శ‌రీరాన్ని 32 అడుగుల వ‌ర‌కు పెంచుకునే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటాయి. బ‌ర్మీస్ పైథాన్ అత్యంత ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇవి సాధార‌ణంగా 16 నుంచి 23 అడుగుల వ‌ర‌కు పెరుగుతాయి.

ప్ర‌త్యేక‌మైన చ‌ర్మం..

కొండ‌చిలువ‌ల‌కు ప్ర‌త్యేక‌మైన రంగురంగుల చ‌ర్మం కలిగి ఉంటాయి. చాలా వ‌ర‌కు మ‌చ్చ‌లు, చార‌ల‌ను క‌లిగి ఉంటాయి. దాదాపు కొండ‌చిలువ‌లు ప‌రిస‌రాల్లో ఉన్న రంగుల్లో క‌లిసిపోతాయి. గ‌డ్డిలో ఉన్న‌ప్పుడు కొండ‌చిలువ‌ను గుర్తించ‌డం క‌ష్టం.

ఎక్క‌డైనా జీవించ‌గ‌ల‌వు..

పైథాన్‌లు ఎక్క‌డైనా జీవించ‌గ‌ల‌వు. అంటే నీటితో పాటు భూమ్మీద కూడా నివాసం ఏర్ప‌ర‌చుకుంటాయి. ద‌ట్ట‌మైన వ‌ర్షార‌ణ్యాల నుంచి శుష్క ఎడారి ప్రాంతాల వ‌ర‌కు అవి మ‌నుగ‌డ కొన‌సాగిస్తాయి. చాలా వ‌ర‌కు నీటి వ‌న‌రులు ఉన్న ప్రాంతాల్లో పైథాన్‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.

మ‌గ కొండ‌చిలువ లేకుండానే..

జంతు రాజ్యంలో కొండ‌చిలువ‌లు అద్భుత‌మైన పున‌రుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉన్నాయి. ఆడ కొండచిలువ‌లు మగ కొండచిలువ లేకుండానే పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తాయి. ఈ ప్ర‌క్రియ‌ను పార్థినోజెనిసిస్ అంటారు.

జీవితకాలం..

కొండ‌చిలువలు 30 ఏండ్లు.. అంత‌కంటే ఎక్కువకాలం జీవించ‌గ‌ల‌వు. ఆవాసం, ఆహారం వంటి అంశాల‌పై ఆధార‌ప‌డి కొండ‌చిలువ‌ల జీవిత‌కాలం మారుతుంది. వ‌య‌సు పెరిగే కొద్ది జీవ‌క్రియ రేటు త‌గ్గుతుంది. ఇది కాల‌క్ర‌మేణా ఒత్తిడిని క‌లిగిస్తుంది.

Latest News