Site icon vidhaatha

Monkey’s Faith: వానరం విశ్వాసం..ఉపకారి అంత్యక్రియలకు హాజరై..!

విధాత : మనుషులకంటే జంతువులే విశ్వాసంగా ఉంటాయని..అందులో కుక్క మొదటిదని అందరికి తెలిసిందే. అయితే ఓ కొండముచ్చు తన ఆకలి తీర్చిన వ్యక్తి చనిపోతే అతని పట్ల తన ప్రేమను..విశ్వాసాన్ని చాటుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. శ్మశానానికి వెళ్లి అంత్యక్రియలకు హాజరై అతడి ముఖంపై ముద్దుపెట్టి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. జార్ఖండ్‌లోని డియోఘర్‌లో జంతు ప్రేమికుడు మున్నాసింగ్ తరచూ కోతులకు ఆహారం పెట్టేవాడు. ఇటీవల అతను అనారోగ్యంతో చనిపోయాడు. అతని అంత్యక్రియల సమయంలో ఓ కొండముచ్చు అతని మృతదేహం వద్దకు వచ్చింది.

పాడెపై ఉన్న మున్నాసింగ్ భౌతిక కాయంపై ముద్దు పెట్టింది. గంట పాటు అక్కడే కూర్చుంది. అంత్యక్రియల కోసం సిద్దం చేసిన చితిపై కూర్చుని అతడిని కడసారి చూసుకుంది. అంత్యక్రియల తతంగం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి.. అతని పట్ల తన అనురాగాన్ని చాటుకుని అంతిమ వీడ్కోలు పలికింది. ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులు గమనిస్తూ ఆ వానరాన్ని ఏమి అనకుండా మున్నాసింగ్ పట్ల అది చూపిన విశ్వాసాన్ని ఆసక్తిగా చూస్తూ మనుషుల కంటే జంతువులే మేలు అనుకుని దానిని అభినందించారు.

Exit mobile version