Site icon vidhaatha

మంచు వారు మీరు ఈ జన్మలో మారరా.. మళ్లీ ట్రెండింగ్‌ నెం1

విధాత: మనం చేసే ప్రతి పనిపై ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు.. ఎప్పుడూ మనపై పది కళ్లు చూస్తున్నప్పుడు.. మనం చేసే చర్యలు, మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పెద్దలు చెబుతున్న మాట. కానీ దాని నుంచి మనం ఏ నేర్చుకున్నామన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. కానీ మంచు ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇవేమీ పట్టడం లేదు. ఏదో ఒకటి మాట్లాడటం.. దానిపై ట్రోలింగ్ జరుగుతుంటే మళ్లీ వెంటనే మాట మార్చడం.. ఈ మధ్య వారికి మాములైపోయింది.

ముఖ్యంగా మంచు విష్ణు విషయంలో ఇది రిపీట్ అవుతోంది. తాజాగా ఆయన ‘మా’ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసి.. ఈ సంవత్సరం తన టీమ్‌తో ఏం చేశాడో.. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో చెబుతూ.. ఓ భారీ ప్రసంగం ఇచ్చారు. అందులో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు నియంత పాలనలా అనిపించడంతో.. అందరూ ట్రోలింగ్ మొదలెట్టారు.