హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే జనవరి 11వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఏఐసిసి కార్యాలయం షెడ్యూలు విడుదల చేసింది.
రెండు రోజుల పాటు హైదరాబాద్ లో మకాం వేసి పార్టీ నాయకులతో సమావేశమవుతారు. జనవరి 11వ తేదీ బుధవారం ఉదయం 9.25 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని 10.30 గంటలకు నాంపల్లి గాంధీ భవన్ చేరుకోనున్నారు.
ఉదయం ఎఐసిసి సెక్రెటరీలు, పిసిసి అధ్యక్షుడు, ఆ తరువాత సిఎల్పి నాయకుడు, సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశమవుతారు.
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తదనంతరం ఎగ్జిక్యుటివ్ కమిటి, పిసిసి కార్యవర్గంతో సమావేశమై చర్చించనున్నారు.
మరుసటి రోజు 12న ఉదయం 10.30 గంటలకు డిసిసి అధ్యక్షులు, తరువాత అనుబంధ సంఘాల అధ్యక్షులతో మాణికర్ రావు థాక్రే భేటీ అవుతారు. తిరిగి అదేరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.