మారుతి సుజుకీ తొలి ఈవీ వచ్చేస్తోంది..! ఒకసారి ఛార్జ్‌ చేస్తూ 550 కిలోమీటర్ల దూసుకెళ్లొచ్చు..!

ఇటీవల కాలంలో భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీగా డిమాండ్‌ ఉన్నది. దాదాపు అన్ని సంస్థలు పోటీపడి ఈవీ వాహనాలను తీసుకువస్తున్నాయి

  • Publish Date - December 9, 2023 / 06:09 AM IST

విధాత‌: ఇటీవల కాలంలో భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీగా డిమాండ్‌ ఉన్నది. దాదాపు అన్ని సంస్థలు పోటీపడి ఈవీ వాహనాలను తీసుకువస్తున్నాయి. అయితే, జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం మాత్రం ఇప్పటి వరకు ఈవీ సెగ్మెంట్‌లో ఒక్క కారును సైతం తీసుకురాలేకపోయింది. తాజాగా కంపెనీ ఈవీ కారును తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సుజుకీ ఈవీఎక్స్‌ను పరిచయం చేయబోతున్నది. కార్ల ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రారంభంలో షురూ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.


ఈవీఎక్స్​ ఎస్​యూవీని గుజరాత్​ హన్సల్​పూర్​లోని సుజుకీ మోటార్​ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నది. ఇది మారుతికి చెందిన సబ్సిడరీ ప్లాంట్‌. ఇది 2017 నుంచి పని చేస్తున్నది. అయితే, ఈవీ కార్ల తయారీ నేపథ్యంలో ప్లాంట్‌లో మారుతి భారీగానే మార్పులు చేసింది. మారుతి కారులో 60 KWH లిథియం అయాన్‌ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. మారుతి తొలి ఈవీ డిజైన్‌ సైతం చాలాఫ్యూచరిస్టిక్​గా ఉన్నది. దాంతో వినియోగదారుల నుంచి భారీగానే డిమాండ్‌ ఉండవచ్చని భావిస్తున్నది.


ఇదిలా ఉండగా.. మారుతి ఇటీవల జపాన్‌లో స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ను ఇటీవల లాంచ్‌ చేసింది. 2024లో భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. అయితే, ఇందులో కొన్ని మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఈ కారులో 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. మైల్డ్​ హైబ్రీడ్​ వేరియంట్​ సైతం ఉండే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై కంపెనీ క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. తొమ్మిదేళ్లకు ముందు తొలిసారిగా ఈ మోడల్‌ లాంచ్‌ అవగా.. ఇప్పటి వరకు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ మార్కెట్‌లోకి రాలేదు. కానీ, మార్కెట్‌లో డిజైర్‌కు గట్టిపోటీని ఇస్తూ ఇతర మోడల్స్‌కు అప్‌డేట్స్‌ వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన మారుతి డిజైర్‌ ఫేస్‌లిఫ్ట్‌కు సిద్ధమైంది.