Bajaj Chetak | చౌక ధరకే బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అదిరిపోయే ఫీచర్స్‌..!

Bajaj Chetak | మోటార్‌ పొల్యూషన్‌ను తగ్గించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సబ్సిడీలు ఇచ్చింది. ఇటీవల ఆ సబ్సీడీలను తగ్గించింది. దాంతో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు పెరిగాయి. ఈ ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దాంతో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) కంపెనీలకు కష్టాలు పెరిగాయి.

  • Publish Date - April 23, 2024 / 10:43 AM IST

Bajaj Chetak : మోటార్‌ పొల్యూషన్‌ను తగ్గించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సబ్సిడీలు ఇచ్చింది. ఇటీవల ఆ సబ్సీడీలను తగ్గించింది. దాంతో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు పెరిగాయి. ఈ ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దాంతో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) కంపెనీలకు కష్టాలు పెరిగాయి.

ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్.. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు చౌక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మీరు ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్టయితే చౌక ధరలో రాబోతున్న బజాజ్‌ చేతక్ కోసం వేచి చూడవచ్చు. ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను స్టీల్‌ బాడీతో తయారు చేస్తున్నారు.

రాబోయే కొద్ది నెలల్లో కంపెనీ తన రిటైల్ స్టోర్ల పరిమాణాన్ని మూడు రెట్లు పెంచాలని యోచిస్తోంది. బజాజ్ ఆటో ఇప్పటికే చేతక్ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. దీని రెండు వేరియంట్‌లు అయిన చేతక్ అర్బన్, చేతక్ ప్రీమియం మార్కెట్లో ఉన్నాయి.

కొత్త స్కూటర్‌లో చిన్న బ్యాటరీ..

చేతక్ చౌక ధర వాహనాన్ని చిన్న బ్యాటరీతో తీసుకొచ్చే ఛాన్స్‌ ఉంది. దానిలో హబ్-మౌంటెడ్ మోటార్‌ను ఉపయోగించనుంది. బజాజ్ సంస్థ 2020 జనవరిలో EV మార్కెట్‌లోకి ప్రవేశించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 1.06 లక్షల చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. అంతేగాక కంపెనీ మార్కెట్ వాటా 14 శాతం మెరుగుపడింది. ప్రస్తుతం బజాజ్ చేతక్ దేశంలోని 164 నగరాల్లో దాదాపు 200 స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంది.

రాబోయే మూడు నాలుగు నెలల్లో ఆటో స్టోర్ల సంఖ్యను దాదాపు 600కు పెంచాలని బజాజ్ భావిస్తోంది. కొత్తగా తీసుకొస్తున్న చేతక్ చౌకైన మోడళ్లకు ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే ఫీచర్లను అందించే అవకాశం ఉంది. దీని డిజైన్ కూడా ఇప్పటికే ఉన్న చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లానే ఉండనుంది.
అయితే ఈ కొత్త స్కూటర్‌ ధరను బజాజ్ వెల్లడించలేదు.

ఈ చేతక్ చౌకైన వేరియంట్‌ను బజాజ్‌ మే నెలలో ప్రారంభనుంది. లాంచ్ ఈవెంట్‌లోనే కొత్త చేతక్ ధరను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది. బజాజ్ ప్రస్తుత చేతక్ అర్బన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.23 లక్షలు, చేతక్ ప్రీమియం ఎక్స్ షోరూమ్ ధర రూ.1.47 లక్షలుగా ఉంది. ఒకసారి పూర్తిగా చార్జిచేస్తే బజాజ్ చేతక్ అర్బన్ 113 కిలోమీటర్లు, చేతక్ ప్రీమియం 126 కిలోమీటర్లు నడుస్తుంది.

Latest News