Site icon vidhaatha

Exploding Electric Vehicle| పేలిన ఎలక్ట్రిక్ వాహనం…మహిళ మృతి

విధాత : ఎలక్ట్రిక్ వాహనాలు తరచు పేలిపోతు వాహనదారులు భయపెడుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం పేలిన ఘటనలో ఓ మహిళ ప్రాణం కూడా కోల్పోయింది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూటీకి ఛార్జింగ్‌ అవుతుండగా పేలుడు చోటుచేసుకుంది. దీంతో పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని వెంకట లక్ష్మమ్మ (62)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాహనం పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఫోరెన్సిక్‌ టీంను రప్పించారు. అలాగే ఈ బైక్ తయారీ సంస్థకూ ఘటనపై సమాచారం అందించారు.

Exit mobile version