Varanasi | రాజమౌళి ‘వారణాసి’లో ఊహించ‌ని ట్విస్ట్‌లు.. మహేష్ డ్యూయల్ రోల్, త్రిమూర్తుల సర్ప్రైజ్ ఎంట్రీలు?

Varanasi | దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్‌ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. మైథలాజికల్ అంశాలను టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామాతో మేళవిస్తూ రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు.

వారణాసి సినిమాలో నందిని అధిరోహించిన మహేశ్ బాబు

Varanasi | దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్‌ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. మైథలాజికల్ అంశాలను టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామాతో మేళవిస్తూ రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. మరో కీలక పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. రాజమౌళి మార్క్‌కి భిన్నంగా, అత్యాధునిక టెక్నాలజీతో హాలీవుడ్ టెక్నీషియన్ల సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టీజర్ స్పష్టం చేసింది. ఈ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే ఆధునిక పాత్రతో పాటు త్రేతాయుగంలో శ్రీరాముడిగా కూడా కనిపించనున్నాడన్న వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా రామాయణానికి సంబంధించిన పతాక ఘట్టాలు సినిమాలో ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అదేవిధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్ర కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. అంతేకాదు, ఈ చిత్రంలో సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కీలక పాత్రల్లో కనిపిస్తారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ త్రిమూర్తుల పాత్రల్లో ఏ స్టార్ నటులు నటిస్తారన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంచారు. వీటితో పాటు ఓ అఘోరా పాత్ర కూడా కథలో కీలకమని, ఆ పాత్రలో ప్రముఖ నటుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఓ భారీ పడవ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇది విలన్ ఎంట్రీకి సంబంధించిన ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రాకు సంబంధించిన షెడ్యూల్ కూడా దాదాపు పూర్తయినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మైథాలజీ, టైమ్ ట్రావెల్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.

Latest News