Chandipur Beach | కనుచూపు మేర విస్తరించి ఉన్న సముద్రం.. ఒక్కసారిగా మాయమైపోతే..? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. ప్రతీ బీచ్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది పర్యాటకులు తమకు అందుబాటులో ఉన్న బీచ్‌కు వెళ్లి చిల్ అవుతుంటారు. అలల రాక, ఆటుపోట్లు, కాళ్లను తాకే సముద్రపు అలల తాకిడి చూస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే, ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చండీపూర్ బీచ్ (Chandipur Beach) మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ సముద్రం చూస్తుండగానే మాయమైపోతుందట.
రోజులో రెండుసార్లు..
బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే చండీపూర్ బీచ్ చూడటానికి ఇతర బీచ్‌ల మాదిరే. కానీ నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఈ బీచ్ అకస్మాత్తుగా మాయమైపోతుందట. భారీ అలలు ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు నీరు సుమారు 5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది. రోజులో ఇలా రెండుసార్లు జరుగుతుందంట (Chandipur Beach Disappears Twice Daily). దీంతో అక్కడికి వచ్చే సందర్శకులు బీచ్ మాయమవడంతో ఆశ్చర్యపోతున్నారు. మనం చూస్తున్నంత సేపూ కనిపించే సముద్రం ఒక్కసారిగా కనిపించకుండా పోతుంది. సముద్రం నీరు వెనక్కి వెళ్ళిన చోట సముద్ర గర్భం బయటపడుతుంది.
వింతైన ప్రకృతి దృశ్యాలను, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడే పర్యాటకులకు చండీపూర్ ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఈ దృశ్యం మరేదో లోకంలో ఉన్నామా అన్న భావన కలిగిస్తుంది. అయితే, ఈ వింత ఎప్పుడు జరుగుతుందో తెలిసిన వారికి మాత్రమే ఈ అద్భుతం సాక్షాత్కరిస్తుంది. దీనికి దేశంలోనే అరుదైన బీచ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది.
స్థానికులకు కామనే అయినప్పటికీ..
అయితే, ఏ సమయంలో బీచ్ ఉన్నట్టుండి మాయమవుతుందో కచ్చితంగా చెప్పలేం. స్థానికులకు ఇది సర్వసాధారణమే అయినప్పటికీ.. కొత్తగా వచ్చే సందర్శకులు ఓ వింత. మరో విశేషం ఏమిటంటే సముద్రం అలా వెనక్కి వెళ్లినప్పుడు అక్కడ ఖాళీగా ఏర్పడిన ప్రదేశంలో ఎవరైనా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లొచ్చు. దీంతో వారు సముద్రంపై నడుస్తున్నామనే అరుదైన భావన కలుగుతుంది. అందుకే చాలా మంది ఈ బీచ్‌ను చూసేందుకు వెళ్లాలని ఆశపడుతుంటారు.
ఇవి కూడా చదవండి :
Gold and Silver Price Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు
Suprita | మా అమ్మకి మళ్లీ పెళ్లి చేస్తా.. నా నెంబర్ కోసం అతడు రూ.20వేలు ఖర్చు చేశాడన్న సుప్రిత
