Gold and Silver Price Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,57,910 వద్ద, కిలో వెండి ధర రూ.3 లక్షల వద్ద నిలిచింది.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Feb 10, 2026, 1:06 pm IST
Read Time: 3 mins
Gold and Silver Price Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గుల దోబుచులాట మంగళవారం బ్రేక్ తీసుకుంది. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఈ రోజు క్రితం రోజు ధరల వద్దనే స్థిరంగా కొనసాగుతున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,57,910 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,44,750వద్ద నిలిచింది.

కిలో వెండి ధర రూ.3లక్షల వద్దనే

మంగళవారం కిలో వెండి ధర సైతం రూ.3,00000 వద్దనే స్థిరంగా కొనసాగుతుంది. అయితే వెండి, బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు 1 శాతం నుంచి 2 శాతం వరకు పడిపోయాయి.

అయితే వచ్చే వారం మార్కెట్ల దిశను నిర్ణయించడంలో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల సంకేతాలు ఇస్తే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలపై అంచనాలు బలపడే అవకాశం ఉంది. అదే జరిగితే బంగారం ధరలకు మద్దతు లభించవచ్చు. మరోవైపు, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉంటే డాలర్ బలపడే అవకాశం ఉంది. ఇది బులియన్‌పై ఒత్తిడిని పెంచవచ్చు అంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, జీడీపీ డేటా, పీఎంఐ రిపోర్టులు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు వంటి ఆర్థిక పరిణమాల క్రమంలే వచ్చే వారం బంగారం ధరలు స్థిరంగా కదలాడే అవకాశం ఉందని.. అయితే వెండి ధరలు మరింత హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు

ఇవి కూడా చదవండి :

Indian couple | పెళ్లి ఖర్చుతో ఇల్లు కొని.. లివింగ్ రూమ్‌లో వివాహం చేసుకున్న జంట‌.. నెట్టింట ప్ర‌శంస‌లు
Temples in India | దేశంలో 6,48,907 ఆల‌యాలు.. అత్య‌ధికంగా త‌మిళ‌నాడులోనే..!