అమరావతి : ‘మొంథా’ తుపాన్ భారీ వర్షాలకు కాలజ్ఞాని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కూలిపోయింది. కడపలో వరుస వర్షాల ధాటికి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కూలిపోయిన ఘటన భక్తులను కలవరపరిచింది. చారిత్రక స్థలాన్ని కాపాడడంలో అధికారులు, వారసులు విఫలమయ్యారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మం ఎనబై అయిదో ఏట వైశాఖ శుద్ధ దశమినాడు సజీవసమాధిలోకి ప్రవేశించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. బనగానపల్లెలో ఆయన రచించిన 14000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై చింతచెట్టును పెంచి పూజించటం విశేషం.
దైవ స్వరూపుడైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 400ఏళ్ల క్రితమే రాబోయే భవిష్యత్తులో తలెత్తే మార్పులు, విపత్తులు, వింతల గూర్చి తన కాలజ్ఞానం పుస్తక రచనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పేర్కొన్న అనేక సంఘటనలు అనంతర కాలంలో నిజమవుతూ రావడం కూడా ఆయన కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యుత్తు, యంత్రాలు, విమానాల రాక, అంతరిక్ష యానాలు, రాజులు పోయి ప్రజాస్వామిక ప్రభుత్వాలు రావడం వంటి అనేక జోస్యాలు నిజమవ్వడంతో బ్రహ్మంగారి కాలజ్ఞానంకు మరింత ప్రఖ్యాతి ఏర్పడింది. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందంటూ కరోనా వైరస్ గా గూర్చి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పడం విశేషం.
ఈ ఏడాదిలో వచ్చిన బ్యాంకాక్, మయన్మార్‌ల భూకంపాలు గూర్చి కాలజ్ఞానంలో ఉందని, ఈ ఏడాది మన దేశంలో శ్రావణ, బాద్రపద మాసాల్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒక వైపు తుపాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరో వైపు తాగడానికి చుక్క నీరు తాగడానికి లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉందని.. భూకంపాలు, వరదలు, కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీరప్రాంత నగరాలను ముంచెత్తుతుందని కూడా కాలజ్ఞానంలో ఉందంటున్నారు.
కడపలో వరుస వర్షాల ధాటికి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కూలిపోయింది. చారిత్రక స్థలాన్ని కాపాడడంలో అధికారులు, వారసులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/KWjRePvIXX
— Pallavi Media (@pallavimedia) October 29, 2025
