అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. అమరావతిలోని రాయపూడిలో హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. . వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర వేడుకలు తిలకించేందుకు ప్రజలు, రైతులు భారీగా హాజరయ్యారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన సందేశంలో 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రకటించారు. కలిసి కట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం అని గవర్నర్ పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రగతికి ఏపీ ప్రజలే నిజమైన శిల్పులు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ది ప్రాజెక్టులు వేగంగా పురోగతి సాధిస్తున్నాయని, అన్ని సంస్థలు తిరిగి బలపడుతు ప్రజల విశ్వాసాన్ని సాధిస్తూ అభివృద్ది మార్గంలో ముందడుగు వేస్తున్నాయన్నారు.
