Indian couple | పెళ్లి ఖర్చుతో ఇల్లు కొని.. లివింగ్ రూమ్‌లో వివాహం చేసుకున్న జంట‌.. నెట్టింట ప్ర‌శంస‌లు

పెళ్లి (wedding) కోసం చాలా మంది కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంటారు. కానీ ఓ జంట అందుకు విరుద్ధంగా ఆలోచించింది. పెళ్లికి పెట్టే ఖ‌ర్చును త‌మ‌కు జీవితాంతం నీడ‌నిచ్చే ఇంటిపై ఇన్వెస్ట్ చేసింది (Couple buys house). అంద‌మైన ఇంటిని కొనుగోలు చేసి అందులోనే వివాహ బంధంతో ఒక్క‌టైంది.

Indian couple | పెళ్లి (wedding).. అదో అంద‌మైన జ్క్షాప‌కం. జీవితాంతం గుర్తుండిపోయే వేడుక‌. ఈ వేడుక‌ను చాలా మంది ఘ‌నంగా చేసుకోవాల‌ని క‌ల‌లు కంటారు. అందుకోసం భారీగా ఖ‌ర్చు చేస్తారు. ఖ‌రీదైన దుస్తులు, న‌గ‌లు, ఫుడ్ అంటూ ఆర్భాటాల‌కు పోయి చాలా మంది కోట్లాది రూపాయ‌ల్ని పెళ్లి కోసం త‌గ‌లేస్తారు. కానీ ఓ జంట అందుకు విరుద్ధంగా ఆలోచించింది. పెళ్లికి పెట్టే ఖ‌ర్చును త‌మ‌కు జీవితాంతం నీడ‌నిచ్చే ఇంటిపై ఇన్వెస్ట్ చేసింది (Couple buys house).

ఖ‌రీదైన దుస్తులు, భారీ ఫంక్ష‌న్ హాల్‌, వేల సంఖ్య‌లో అతిథులు.. ఇలా ఏవీ లేకుండా దానికి అయ్యే సొమ్మును పొదుపు చేసింది. దాంతో ఓ అంద‌మైన ఇంటిని కొనుగోలు చేసింది. ఆ అంద‌మైన క‌ల‌ల‌ ఇంట్లోనే వారు వివాహ బంధంతో ఒక్క‌టి కావ‌డం విశేషం. లివింగ్ రూమ్‌లో అతికొద్ది మంది స్నేహితులు, బంధు మిత్రుల స‌మ‌క్షంలో ఎలాంటి ఆర్బాటాల‌కు పోకుండా వివాహం చేసుకుంది ఈ జంట‌. వీరి పెళ్లి వార్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

నెట్టింట ప్ర‌శంస‌లు..

ఈ పోస్టు చూసిన నెటిజ‌న్లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మే కాకుండా.. వారు చేసిన ప‌నిని మెచ్చుకుంటున్నారు. ఈ జంట చాలా మందికి ఆద‌ర్శం అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి పేరుతో అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవ‌డం కంటే.. ఆ డ‌బ్బును ఇలా ప్రాప‌ర్టీపై ఇన్వెస్ట్ చేస్తే భ‌విష్య‌త్తులో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైన ఖ‌రీదైన పెళ్లిళ్లు అనే ధోర‌ణి మాని అన‌వ‌స‌రంగా పెళ్లి కోసం రూ.ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయొద్దంటూ సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Varanasi | రాజమౌళి ‘వారణాసి’లో ఊహించ‌ని ట్విస్ట్‌లు.. మహేష్ డ్యూయల్ రోల్, త్రిమూర్తుల సర్ప్రైజ్ ఎంట్రీలు?
బంగారం ఎందుకు పసుపు రంగులోనే ఉంటుంది?.. బూడిద, ఎరుపు రంగుల్లో ఎందుకు ఉండదు.. కారణం తెలుసా?

Latest News