Site icon vidhaatha

ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

విధాత:ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఎలాంటి ఫీజు లేకుండానే వాహన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు నుంచి కూడా మినహాయింపు లభించింది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింతగా పెరుగనున్నాయి. పలు దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి. భారత్ లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు అదనపు ప్రోత్సాహకంగా సెంట్రల్ మోటార్ వాహనాల నియమాలు-1989 సవరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

Exit mobile version