Site icon vidhaatha

Saif ALli Khan: దేవ‌ర విల‌న్‌పై దాడి.. తీవ్ర గాయాలు

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌( Saif ALli Khan)పై దాడి జ‌రిగింది. ఇప్పుడు ఈ ఘ‌ట‌న టోట‌ల్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీని షాకుకు గురి చేసింది. ముంబైలోని నివాసంలో సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా.. గురువారం తెల్లవారుజాము 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్న‌ట్లు స‌మాచారం.

ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నిస్తుండ‌గా అలికిడికి వెంట‌నే లేచిన సైఫ్ దుండ‌గుడిని అడ్డుకునేందుకు యత్నిస్తున్న క్ర‌మంలో అ దొంగ సైఫ్‌పై క‌త్తితో దాడి చేసి అక్క‌డి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్‌ అలీఖాన్‌కు ఒంటిపై ఆరు చోట్ల  తీవ్ర గాయాలు కాగా ముంబై లీలావతి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.పోలీసులు సమాచారం అందుకుని దర్యాప్తు ప్రారంభించడ‌మే కాక‌ ప్ర‌త్యేక బృందాలు సైతం ఏర్పాటు చేశారు. పూర్తి విష‌యాలు తెలియాల్సి ఉంది.

ఇదిలాఉండ‌గా సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా.. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

 

Exit mobile version