SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు 7 అద‌న‌పు మార్కులు

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం విధాత: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఏడు మార్కులు కలపాలని కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఏడు మార్కులు కలపాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయంతో మరికొంత మంది అభ్యర్థులు ప్రిలిమినరి క్వాలిఫై కానుండగా, వారికి ఫిబ్రవరి 15 నుంచి దేహాదారుఢ్య‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మరో లక్ష మంది కానిస్టేబుల్ అభ్యర్థులు […]

  • Publish Date - January 29, 2023 / 12:25 PM IST

  • తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం

విధాత: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఏడు మార్కులు కలపాలని కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఏడు మార్కులు కలపాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయంతో మరికొంత మంది అభ్యర్థులు ప్రిలిమినరి క్వాలిఫై కానుండగా, వారికి ఫిబ్రవరి 15 నుంచి దేహాదారుఢ్య‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మరో లక్ష మంది కానిస్టేబుల్ అభ్యర్థులు క్వాలిఫై అవుతారని అంచనా వేస్తున్నారు.

కానిస్టేబుల్ ప్రిలిమినరీ క్వాలిఫై పరీక్షలు తప్పులపై అభ్యర్థులు కోర్టుకు వెళ్ల‌డంతో విచారణ అనంతరం కోర్టు 7 మార్కులు కలపాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఆలస్యంగానైనా ప్రభుత్వం, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులు హైకోర్టు ఆదేశాల అమలుకు నిర్ణయించడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest News