ఆ రెండు రోజులు బ్యాంకులన్నీ పనిచేస్తాయి..

తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. జనవరి 30,31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది. ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్‌ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్నవిభాగాల్లో నియామకాలు […]

  • Publish Date - January 28, 2023 / 09:41 AM IST

తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. జనవరి 30,31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది. ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్‌ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్నవిభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్ల సాధన కోసం బ్యాంకు యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఈ డిమాండ్లపై చర్చ కోసం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమవడానికి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ అంగీకరించింది. దీంతో సమ్మె నిర్ణయాన్ని యూఎఫ్‌బీయూ వాయిదా వేసింది. దీంతో జనవరి 30,31 తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.

Latest News