విధాత, హైదరాబాద్: రద్దయిన పెద్ద నోటు రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లు తమకు ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో చేరలేదని ఆర్బీఐ పేర్కొంది. ప్రజల వద్ద ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పుడు కూడా రూ.2 వేల నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చన్న ఆర్బీఐ తెలిపింది.
ఇండియా పోస్టు ద్వారా వాటిని పంపితే.. బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేసింది. బ్లాక్ మనీ, అవినీతి, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాతా..కరెన్సీ కొరత అధిగమించేందుకు రిజర్వ్ బ్యాంకు 2016నవంబర్ 8న రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టింది.
ఆ తర్వాత 2023మే 19న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంది. ఆ సమయంలో రూ.3.56లక్షల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాచి. వాటిని మార్చుకునేందుకు 2023ఆక్టోబర్ 7వరకు అవకాశమిచ్చింది. ఆ తర్వాతా మిగిలిపోయి రూ.2వేల నోట్లను ఆర్బీఐ కేంద్రాల్లో మార్చుకునే వీలు కల్పించింది. ఇప్పటికి ప్రజల వద్ద ఉండిపోయిన రూ.2వేల నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని తెలిపింది