Fake Paneer: హైదరాబాద్‌లో పన్నీరు కొంటున్నారా.. అయితే జాగ్రత్త

నగరంలో రోజురోజుకు కల్తీ దందాలు పెట్రేగిపోతున్నాయి. పిల్లలు తాగే పాల నుంచి పెద్దలు వేసుకునే మందుల వరకు కల్తీమయం అవుతున్నాయి. నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన ఆకస్మిక దాడుల్లో ఏకంగా 2600 కేజీల నాసిరకం పన్నీర్ పట్టుకున్నారు. జియా గూడలో నకిలీ పచ్చళ్ల ఫ్యాక్టరినీ సీజ్ చేశారు. ఈ తనికీల్లో భాగంగా 1100 కేజీలకు పైగా నకిలీ అల్లం వెల్లుల్లీ పేస్ట్‌ను సీజ్ చేశారు.

విధాత, హైదరాబాద్:  హైదరాబాద్‌లో టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝులుపుతున్నారు.  సికింద్రాబాద్ పరిధిలో నిన్న నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున తయారు చేస్తున్న ఫేక్ పన్నీర్ ముఠా గుట్టురట్టైంది. పన్నీర్‌తో పాటు నాసిరకమైన పచ్చళ్లు, అల్లం వెల్లుల్లి పేస్టులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని తయారు చేస్తున్న షాపుల్లో ఎలాంటి నాణ్యత ప్రమానాలు లేనట్లు గుర్తించారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు డైరీ షాపుల్లో రైడ్స్ చేయగా ఏకంగా 2600 కేజీల నాసిరకం పన్నీర్‌ను పట్టుకున్నారు. ఆ పన్నీరును నిర్వాహకులు హోటల్స్‌కు, క్యాటరింగ్ సర్వీసులకు, లోకల్‌ షాపులకు అమ్ముతున్నట్లు గుర్తించారు.

పోలీసుల దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సులభంగా డబ్బు సంపాధించడానికి ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు లేని పన్నీర్‌ను జెన్యూన్ పన్నీర్‌గా బురిడీ కొట్టించి ప్రజలకు అమ్ముతున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.  పన్నీర్‌ను దుమ్ముదూళి, ఈగలు ముసురుకున్న ప్రాంతంలో గుర్తించామని, ఎలాంటి లేబుల్స్ కానీ, ఎక్స్‌పైరీ డేట్స్ కానీ లేవని పోలీసులు తెలిపారు. పన్నీర్ మాత్రమే కాకుండా, కోవా, వెన్న, నెయ్యి అలాగే ఇతర స్వీట్స్‌ను కూడా సీజ్ చేశామన్నారు. ఇవన్నీకలిపి 5600 కేజీల వరకు ఉంటాయని తెలిపారు. వీటి నిర్వాహుకులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇది మాత్రమే కాకుండా జియాగూడలో టాస్క్‌ఫోర్స్ రైడ్స్‌లో చట్టవిరుద్దంగా నడిపిస్తున్న పచ్చళ్ల ఫ్యాక్టరీని గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయలతో పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ 72 డ్రమ్ముల్లో నిల్వ చేసిన రకరకాల పచ్చళ్లను, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వాటిని తయారు చేసేందుకు వనియోగిస్తున్న కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని గనక ప్రజలు తింటే ఆనారోగ్యంపాలు అవ్వక తప్పదని పోలీసులు పేర్కొన్నారు. అలాగే బోరబండలో నిర్వహించిన తనికీల్లో 1100 కేజీల అల్లం వెల్లుల్లీ తయారీకి వినియోగించే మెటీరియల్స్‌ను సీజ్ చేశారు. వీటిలో సిట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్‌ను కలిపి ఒపెన్ డ్రమ్ముల్లో నిల్వ చేశారని, వాటిని హైదరాబాద్‌లోని హెటల్స్‌కు, క్యాటరింగ్‌లకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్టులు, ఇతర డైరీ ప్రొడక్ట్స్, పచ్చళ్లు కొనే ముందు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసలు సూచించారు.

ఇవి కూడా చదవండి :

Droupadi Murmu Visits Ayodhya : అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Ram Charan | జూబ్లీహిల్స్‌లో రూ.30 కోట్ల ఇంద్రభవనం.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లగ్జరీ హోమ్ ఎలా ఉందంటే?

Latest News