Site icon vidhaatha

సూర్యాపేట: కళాశాల గోడకూలి 13 మంది విద్యార్థులకు గాయాలు

విధాత: సూర్యాపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాల హాస్టల్ మెట్ల గోడ కూలడంతో 13 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని గాయపడిన తమ పిల్లల్ని చూసి బోరున విల‌పించారు. స్టడీ అవర్ ముగిశాక విద్యార్థులు గోడ ప్రక్కన నిలబడిన సందర్భంలో ఆకస్మాత్తుగా గోడ కూలీ మీద పడడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. పాత భవనంలో కళాశాల హాస్టల్ నిర్వహించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి ఆసుప‌త్రికి వెళ్లి గాయాల‌యిన విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించారు.

Exit mobile version