Allu Arjun | ‘ధురంధర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం.. “భారతీయ కథకు అంతర్జాతీయ స్వ్యాగ్” అంటూ ట్వీట్

Allu Arjun | భారీ అంచనాల మధ్య విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ నేడు (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.

Allu Arjun | భారీ అంచనాల మధ్య విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ నేడు (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.

హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోల ద్వారా మంచి స్పందన అందుకుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలు, కథన విధానం పరంగా హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్ ప్ర‌శంస‌లు..

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 229 నిమిషాల నిడివి ఉంది. శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వికాల్ నోవ్లఖా సినిమాటోగ్రఫీ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చూపించింది. రణవీర్ సింగ్‌తో పాటు మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని వీక్షించి చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన వెంటనే ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “ఇప్పుడే ‘ధురంధర్ 2’ చూశాను. దేశభక్తిని చాలా స్టైలిష్‌గా చూపించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉన్న ఈ సినిమాలో విపరీతమైన ఈలలు, చప్పట్లు కొట్టించే సన్నివేశాలు ఉన్నాయి. సినిమా నిజంగా అదిరిపోయింది” అని పేర్కొన్నారు.

జైహింద్ అంటూ ట్వీట్ ముగింపు..

అలాగే రణవీర్ సింగ్ నటనను ప్రత్యేకంగా ప్రశంసించిన అల్లు అర్జున్, “మన దేశంలో రణవీర్ సింగ్ లాంటి ప్రతిభావంతుడైన నటుడు ఉండటం గర్వంగా ఉంది. ఆయన తన నటనతో స్క్రీన్‌పై నిప్పులు చెరిగారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాతో సిక్సర్ కొట్టారు. భారతీయ కథను అంతర్జాతీయ స్థాయిలో చూపించారు” అంటూ అభినందించారు. చివరగా “జై హింద్” అంటూ తన ట్వీట్‌ను ముగించారు.

“భారతీయ కథ.. అంతర్జాతీయ స్వ్యాగ్” అంటూ అల్లు అర్జున్ ఇచ్చిన ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ ప్రశంసలు రావడంతో ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ వసూళ్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ వీకెండ్‌లో థియేటర్ల వద్ద దేశభక్తి, యాక్షన్ హంగామా ఒక రేంజ్‌లో ఉండబోతుందని సినీ వర్గాలు అంటున్నాయి.

Latest News