Media Freedom
- సమాచార హక్కుకు గొడ్డలిపెట్టు
- ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై ఆంక్షల కత్తి
న్యూ ఢిల్లీ, విధాత ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్ల మెంటు వర్షాకాలం సెషన్ లో డాటా ప్రొటెక్షన్ బిల్లు (వ్యక్తి గత సమాచార పరిరక్షణ బిల్లు-2023) ను పాస్ చేసింది. ఈ బిల్లును పార్ల మెంటులో ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అయితే ఈ బిల్లు పై విస్తృత చర్చలకు అనుగుణంగా సమయం కేటాయించకుండానే హడావుడిగా సంఖ్యాబలంతో బిల్లును పాస్ చేయించింది. సాధారణంగా ఏదైనా బిల్లు సభ ముందు ప్రవేశ పెట్టినప్పుడు అన్ని వర్గాల అభిప్రాయాలను కూలంకషంగా చర్చించేందుకు అవకాశం కల్పించబడుతుంది.
కాని బీజేపీ ప్రభుత్వం అటువంటి దానికి ఏవిధంగానూ అవకాశం ఇవ్వకుండా తొందరపాటు తో బిల్లును మంది బలంతో పాస్ చేయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. బిల్లు పూర్వ పరాలలోకి వెళితే పార్లమెంటులో పాస్ అయిన డాటా ప్రొటెక్షన్ బిల్లు ముఖ్యంగా సమాచారం అందించిన (వనరుల) సోర్సెస్ పై దాడి చేసే అవకాశం వుంది. అంతేకాదు మీడియాపై కూడా మితిమీరిన హద్దులు విధించే ప్రమాదం పొంచి వుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిగతా విమర్శలతో బాటు ఈ బిల్లు జర్నలిజం యొక్క ప్రాధాన్యతను తగ్గించి వేస్తుంది. ఇంకా ఇది సమాచారం అందించిన సోర్సును తెలియ పరచ వలసిందిగా జర్నలిస్టులపై ఒత్తిడి చేయగలుగుతుంది. ఒకవేళ ప్రచారమైన సమాచారం ప్రభుత్వానికి వ్యతిరేకమైనదనుకుంటే దాన్ని కుంటి సాకులతో సెన్సారుచేసి తమకు అనుకూలంగా మార్చుకునే సులువు చట్ట రీత్యా దానికి లభిస్తుంది.
సమాచార హక్కు క్రింద ప్రభుత్వ రికార్డుల నుండి సమాచారం పొందే హక్కును, ప్రభుత్వ జవాబుదారి తనాన్ని రెండింటిని మార్చి వేసి కొత్త బిల్లు తిరగరాసింది. దాని ప్రకారం సమాచారం ప్రభుత్వం అంగీకరిస్తేనే పొందగలుగుతారు. జవాబుదారితనం కూడా ప్రభుత్వానికి అంతగా పట్టింపు లేకుండా బిల్లు లో మార్పులుచేశారు. ఈవిషయాలను భారత ఎడిటర్స్ గిల్డ్ మరియు దిగి పబ్ అనే సంయుక్త ఇండిపెండెంట్ డిజిటల్ మీడియా ఈ వారంలో ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
జర్నలిస్టులపైన, సోర్సులపైన, వ్యక్తిగత వివరాలపైన నిఘా..
డాటా బిల్లు లోని 36వ క్లాజ్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి తమకు విశ్వాసం అని తోచిన సమాచారాన్ని ఇతరుల నుండి నచ్చిన తీరులో పొందవచ్చు ఎవరిపైనైనా వ్యక్తిగత సమాచారాన్ని మార్చినారని ప్రభుత్వం విశ్వసిస్తే వారిపై చర్యలు తీసుకొనే అవకాశాన్ని ఈబిల్లు కల్పిస్తున్నది. అంటే ఇది ప్రభుత్వానికి అపర అధికారాలను కట్టబెడుతుంది.
ఈ విషయాన్ని కొంత వివరంగా చెప్పాల్సి వస్తే ఏదైనా వార్తాసంస్థకు, లేదా ఒక జర్నలిస్టుకు దీన్ని వర్తింపజేస్తే ప్రభుత్వం ఏ జర్నలిస్టునైనా టార్గెట్ చేసి వారిపై ఏదైనా ఆరోపించి ఆ జర్నలిస్టును, తనకువున్న సోర్సును ఆయన మద్దతుదారులను తెలుసుకోవచ్చు. అలా వారందరిపై చర్యలు తీసుకోవచ్చని ఆసియా ఫసిఫిక్ పాలసీ కౌన్సిల్ అనే ప్రభుత్వేతర సంస్థ కు చెందినా ప్రభుత్వానికిసమాచారం తెలుసుకోవడానికి కావాలిసినంత అధికారం ఈబిల్లు సమకూర్చుతుందని
నమ్రతా మహేశ్వరీ అభిప్రాయపడింది.
ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ హక్కులను కాపాడుతుంది. ఆమె ఇంకా మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పుడు ఏ సమాచారం అడుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి కావునా ఎవరూ సురక్షితంగా వుండలేరని, ఇంకా మహేశ్వరీ వివరిస్తూ ఇది జర్నలిజాన్నివత్తిడికి గురిజేస్తున్నదని, ఇది పరిశోధనాత్మక జర్నలిజానికి, ఇండిపెండెంట్ జర్నలిజానికి ప్రమాదకరమన్నారు.
సెన్సార్ షిప్ కఠినం
ఈ బిల్లులోవివరించిన విధంగా ఏ జర్నలిస్టు అయినా, వార్తాసంస్థపై అయినా ఏదో నెపంపై రూల్స్ అతిక్రమించారని డబ్బు, జరిమానా విధించబడినప్పుడు లేదా గతంలో రెండు సందర్భాలలో ఇటువంటి వాటికి గురైవున్నపుడు ప్రభుత్వం అనుకుంటే ఆ జర్నలిస్టును, ఆసంస్థను పూర్తిగా నిలిపివేయవచ్చు. ప్రజా ప్రయోజనం రీత్యా అనే పేరుతో చర్యలు తీసుకోవచ్చు. అయితే ఈ చర్యలు డాటా పరిరక్షణ బోర్డునుండి అనుమతి పొందిన తరువాత అమలులోకి రావచ్చు.
డాటా పరిరక్షణ బోర్డులో కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులేవుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సెన్సారు షిప్ విధించుట కొరకు విస్తృత అధికారాలను కట్టబెడుతుందని మిశిచౌధరీ అనే టెక్నాలజీ వకీలు, డిజిటల్ మానవ హక్కుల కార్యకర్త అభిప్రాయపడ్డారు. ఆమె అటు అమెరికాలోనూ, భారత్‌లోనూ పని చేస్తున్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఇది మరొక రకంగా సెన్సారు చేయడానికి కనపడని పరికరంగా ప్రభుత్వం చేతిలో ఉపయోగపడుతుందన్నారు.
దీనిపై విశ్లేషించడానికి పైస్థాయిలో మరే సంస్థలు వుండవని, ఈ సెన్సారు షిప్ బిల్లు ద్వారా దేనినైనా సెన్సారు చేయడానికి గతంలోని టెక్నాలజీ చట్టం ద్వారా లభించిన అధికారాలు రెండింతలు పెరుగుతాయని ఆమె అంటున్నది. దానిలో ఉపయోగించిన భాష, డబుల్ అర్ధాలు వచ్చేవిధంగా ఉందని, ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏటైనా తనకు అనుకూలంగా మార్పు చేయగలుగుతుందన్నారు.
ఇంటర్నెట్ ప్రీడమ్ పౌండేషన్ కు చెందిన ఫాలసీ డైరెక్టర్ ప్రీతమ వాఘ్రే మాట్లాడుతూ ఈరోజుల్లో రాజకీయ వాతావరణం ఎవరూ ఊహించలేనిదన్నారు. అది ఎవరినైనా, ఏవార్తా సంస్థలనైనా బ్లాక్ చేసి నిలుపుదల చేయించవచ్చన్నారు.
సమాచార హక్కు నిర్వీర్యం
ఈ చట్టం ప్రకారం సమాచారం అడిగే హక్కు ను డాటా బిల్లు బలహీనపరస్తుంది. ప్రభుత్వం సమాచారం అందిస్తుందనే గ్యారంటీ ఉండదు కానీ సమాచార హక్కు మాత్రం జర్నలిస్టుల చేతిలో బయటకురాని విషయాలను బయటపెట్టించే విధంగా, అందుకు పనిచేసే పరికరంగా ఉపయోగపడనుంది. ప్రజా ప్రయోజనాల రీత్యా అనే సామాజిక కోణంలో ప్రస్తుత బిల్లులో సమాచారహక్కును నిర్వీర్యం చేసినారు.
జర్నలిస్టులను కూడా ఈబిల్లులో సమ్మిళితం చేశారు. కాని గత 2018,2019,2021 లోని డాటా పరిరక్షణ బిల్లులో జర్నలిస్టులను వారి వృత్తికి వున్న ప్రత్యేకతల రీత్యా వారిని మినహాయింపు చేశారు. కాని ప్రస్తుతం 2023 పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లులో మాత్రం అటువంటి మినహాయింపు ఇవ్వలేదు.
ఈ విషయంపై న్యూస్ ల్యాండ్రీ సంస్థ కేంద్ర ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో చర్చించగా ఆయన సమాధానం చెబుతూ జర్నలిస్టులు అయినంత మాత్రాన ఎవరినీ మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
డాటా పరిరక్షణబిల్లు పేరుతో పాస్ చేసిన ఈబిల్లు పరస్పర విరుద్దాలతో కూడుకుని ఉందని, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోలేదని, ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా అధికారాలనలు గుప్పిట్లో పెట్టుకొనేందుకు ఉద్దేశించబడిందిగా విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వం తనని ప్రశ్నించే అవకాశాల్నితగ్గించడానికే ఈ బిల్లును కేంద్రం రూపొందించిందని న్యాయ, పాత్రికేయ, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.