విధాత : ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి చైనా మహిళ అరుదైన రికార్డు లిఖించింది.వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతమైన ఘట్టంగా వైద్యులు పేర్కొంటున్నారు. చైనా షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల దిలి అనే యువతి వుహన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. 20 మంది వైద్య సిబ్బంది కృషితో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి క్షేమంగా జన్మించారు. సహజ సిద్ధంగా ఇలా అయిదుగురు పిల్లలు పుట్టే అవకాశం…6 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందని వైద్యులు తెలిపారు. తమ కెరీర్ లో ఇదొక అరుదైన ప్రసవం అని చీఫ్ డాక్టర్ పేర్కొన్నారు
సాధారణంగా కవలలు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ సహజ సిద్ధంగా ఐదుగురు బిడ్డలు జన్మించడం అనేది అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు. పుట్టిన ఈ బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం వారి అనారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఒకే కాన్పుతో పుట్టిన ఐదుగురు చిన్నారులు పుట్టిన ఘటన నెట్టింటా వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ పిల్లలకు మిరాకిల్ బేబీస్ అని పేర్లు కూడా పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Virosh | పెళ్లి తర్వాత తొలిసారి పబ్లిక్ అపియరెన్స్.. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్–రష్మిక సందడి
Real Life Bichagadu | రియల్ లైఫ్ బిచ్చగాడు.. భార్య కోసం బిక్షాటన చేస్తున్న లాయర్
