Ice Tsunami | మంచు సునామీ.. ఉప్పొంగిన నది.. భయానక దృష్యాలు

Ice tsunami | చైనా (China)లో మంచు సునామీ వచ్చింది. జిన్‌జియాంగ్‌ (Xinjiang) ప్రాంతంలో ఓ నదిలో ‘మంచు సునామీ’ అలలు ఏర్పడ్డాయి.

Ice Tsunami | మంచు సునామీ.. ఉప్పొంగిన నది.. భయానక దృష్యాలు

Ice tsunami | శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఇక, శీతాకాలంలో మంచు
తుఫానులు ఏర్పడటం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అదే మంచు సునామీ (Ice tsunami)లను ఎప్పుడైనా చూశారా..? అయితే ఈ వీడియో మీ కోసమే.

చైనా (China)లో మంచు సునామీ వచ్చింది. జిన్‌జియాంగ్‌ (Xinjiang) ప్రాంతంలో ఓ నదిలో ‘మంచు సునామీ’ అలలు ఏర్పడ్డాయి. గడ్డకట్టిన నది ఉన్నట్టుండి మంచు గడ్డలను చీల్చుకుంటూ ఉప్పొంగింది. మంచు కరిగి ప్రవాహంలా దూసుకెళ్లింది. చెట్లపై ఉన్న మంచు సైతం ఒక్కసారిగా కిందకు పడింది. శీతాకాలం కావడంతో పూర్తిగా మంచుతో పేరుకుపోయిన నదిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఈ దృష్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ భయానక దృష్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఇది కచ్చితంగా ఏ ప్రాంతంలో ఏర్పడిందన్నది తెలియరాలేదు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Heroines | సంక్రాంతి సీజన్‌లో హీరోయిన్లకు అసలైన పరీక్ష.. ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతోంది?
Double Decker Motorhome | రోడ్లపై పరుగులు తీసే 5స్టార్‌ హోటల్‌.. లంబోర్ఘిని డబుల్‌ డెకర్‌ మోటర్‌హోమ్‌.. విశేషాలివి!!