Double Decker Motorhome | రోడ్లపై పరుగులు తీసే 5స్టార్‌ హోటల్‌.. లంబోర్ఘిని డబుల్‌ డెకర్‌ మోటర్‌హోమ్‌.. విశేషాలివి!!

రెండు అంతస్తుల్లో ఉండే ఈ మోటర్‌హోమ్‌లో కింది అంతస్తులో లాంజ్‌, డైనింగ్‌ ఏరియా, పూర్తి స్థాయి కిచెన్‌ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక పై అంతస్తులో బెడ్‌రూమ్స్‌, రిలాక్స్‌ కావడానికి ప్రత్యేక ప్రాంతం, ప్రకృతిని వీక్షించేందుకు స్పెషల్‌గా వ్యూ డెక్‌ ఏర్పాటు చేశారు. ఇక మినీ బార్‌, రిక్లైనర్‌ సీట్లతో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్స్‌.. ఓ మాంఛి హోటల్‌లో ఉన్న ఫీలింగ్‌ తెప్పిస్తాయి.

  • By: TAAZ |    business |    Published on : Jan 07, 2026 2:47 PM IST
Double Decker Motorhome | రోడ్లపై పరుగులు తీసే 5స్టార్‌ హోటల్‌.. లంబోర్ఘిని డబుల్‌ డెకర్‌ మోటర్‌హోమ్‌.. విశేషాలివి!!

Double Decker Motorhome | ఓ డూప్లెక్స్‌ హౌస్‌.. రోడ్లపై పరుగులు తీస్తుంటే భలే ఉంటుంది కదూ! విలాసవంతమైన కార్లకు పెట్టింది పేరైన లంబోర్ఘిని ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చేస్తున్నది. రోడ్లపై దూసుకుపోయే డబుల్‌ డెకర్‌ మోటర్‌హోమ్‌ను సిద్ధం చేసింది. ఇది కేవలం ప్రయాణమే కాదు.. సాక్షాత్తూ రాజభవంతి రోడ్లపై హద్దులు లేకుండా దూసుకుపోవడం! లగ్జరీకి లగ్జరీ.. సోఫిస్టికేటెడ్‌ టెక్నాలజీ, అన్నింటికి మించి రాజసమొలికించే డిజైన్! ఈ మూడింటి మేళవింపుతో ప్రయాణం అర్థమే మార్చేస్తున్నది 2026 Lamborghini Double-Decker Motorhome.

ఇప్పటి వరకూ లంబోర్ఘిని కారులో ప్రయాణం అంటే స్పీడ్‌, స్టైల్‌, సౌండ్‌.. ఇప్పుడు దీనికి లగ్జరీని కూడా జోడించించి తెచ్చిందే డబుల్‌ డెకర్‌ మోటర్‌ హోం. స్టన్నింగ్‌ లుక్‌తో ఉండే ఈ మోటర్‌ హోమ్‌ను చూస్తే ఆర్వీ అనే ఆలోచనే రాదు. షార్ప్‌ ఏరోడైనమిక్‌ లైన్స్‌, అగ్రెసివ్‌ ఫ్రంట్‌ డిజైన్‌, కార్బన్‌ ఫైబర్‌ ప్యానెల్స్‌, ఫ్యూచరిస్టిక్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌తో ఉండే ఈ మోటర్‌ హోమ్‌ను భారీగా కాకుండా.. స్లీక్‌ డిజైన్‌, స్పోర్టీ లుక్‌తో డిజైన్‌ చేశారు. డబుల్‌ డెకర్‌ అయినా.. ఆ ఛాయ కనిపించకుండా మాయ చేశారు.

ఈ మోటర్‌ హోంలో ఉండే పనోరమిక్‌ విండోస్‌, సన్‌రూఫ్స్‌, రిట్రాక్టబుల్‌ బాల్కనీలు.. ఈ కారులో ప్రయాణించేవారికి ప్రయాణంలో కూడా లగ్జరీని అందిస్తాయి.

నిజానికి ఒక్కసారి ఈ మోటర్‌హోమ్‌లోకి వెళితే.. అదేదో లగ్జరీ అపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టిన అనుభూతి కలగడం ఖాయం. ప్రీమియం లెదర్‌ సీట్లు, పాలిష్డ్‌ మెటల్‌ ఫినిష్‌, కార్బన్‌ ఫైబర్‌ డెకర్‌, స్మార్ట్‌ లైటింగ్‌, క్లయిమేట్‌ కంట్రోల్‌.. అబ్బుపరుస్తాయి. ఇక ప్రత్యేక లివింగ్‌ ఏరియా, బెడ్‌రూమ్స్‌, మోడ్రన్‌ కిచెన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌.. దాని స్పెషాలిటీని పీక్స్‌కు తీసుకెళ్లాయంటే ఆశ్చర్యం లేదు. ఫర్నీచర్‌ అంతా మాడ్యులర్‌. అవసరాన్ని బట్టి ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి ఆ ఫర్నీచర్‌ మారిపోతూ ఉంటుంది.

ఇన్ని ఉంటే ఈ భారీ వాహనం ఎలా నడుస్తుందోనని అనుమానించాల్సిన పనిలేదు. ఎందుకంటే దీన్ని తయారు చేసింది లంబోర్ఘిని కనుక. V8 లేదా Hybrid ఇంజిన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. భారీ బరువును సైతం సాఫీగా మోసుకుపోయే పటిష్టమైన ఛాసిస్‌, దానికి తోడుగా అడ్వాన్స్‌డ్‌ సస్పెన్షన్‌ సిస్టమ్‌.. ప్రయాణం సాగుతున్న ఫీలింగ్‌ను కూడా కలగనివ్వవు. భారీ వాహనం అయినా.. స్టీరింగ్‌, బ్రేకింగ్‌ సిస్టమ్‌ అన్నీ సాధారణ కారు తరహాలోనే డిజైన్‌ చేయడం మరో విశేషం.

ఫుల్‌ డిజిటల్‌ డ్రైవర్‌ డాష్‌బోర్డ్‌, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, అడ్వాన్స్‌డ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, 360 డిగ్రీ కెమెరాలు దీనిని టెక్నాలజీలో బాస్‌గా నిలుపుతున్నాయి. ఇక భద్రత కోసం అడాప్టివ్‌ క్రూస్‌ కంట్రోల్‌, కొల్లిజన్‌ అవాయిడెన్స్‌, లేన్‌ అసిస్టెంట్‌, హిల్‌ అసిస్టెంట్‌, స్టెబిలిటీ కంట్రోల్‌.. వంటివి నగరాల్లోనూ, హైవేలలోనే కాదు.. కచ్చా రోడ్లు, ఘాట్‌ రూట్లలో సైతం ప్రయాణాన్ని సురిక్షితం, సులభతం చేయడంతోపాటు.. ఎంజాయ్‌మెంట్‌ను పీక్‌ స్టేజ్‌కు తీసుకుపోతుంది.

ఇక లివింగ్‌ సంగతికి వస్తే.. రెండు అంతస్తుల్లో ఉండే ఈ మోటర్‌హోమ్‌లో కింది అంతస్తులో లాంజ్‌, డైనింగ్‌ ఏరియా, పూర్తి స్థాయి కిచెన్‌ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక పై అంతస్తులో బెడ్‌రూమ్స్‌, రిలాక్స్‌ కావడానికి ప్రత్యేక ప్రాంతం, ప్రకృతిని వీక్షించేందుకు స్పెషల్‌గా వ్యూ డెక్‌ ఏర్పాటు చేశారు. ఇక మినీ బార్‌, రిక్లైనర్‌ సీట్లతో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్స్‌.. ఓ మాంఛి హోటల్‌లో ఉన్న ఫీలింగ్‌ తెప్పిస్తాయి.

ఈ కారులో ఉపయోగించిన హైబ్రిడ్‌ ఆప్షన్స్‌, తక్కువ బరువు మెటీరియల్‌, సోలార్‌ ప్యానెల్స్‌, స్మార్ట్‌ ఎనర్జీమేనేజ్‌మెంట్‌ కారణంగా ఇంధన వినియోగం తక్కువగా ఉండి.. కాలుష్యాన్ని తక్కువగా విడుదల చేస్తుంది.

కార్‌ లవర్స్‌, హైఎండ్‌ ట్రావెలర్స్‌, ప్రయాణాన్ని కూడా స్టేటస్‌ సింబల్‌గా భావించేవారికోసం దీన్ని ఉద్దేశించారు. ఎందుకంటే.. కాస్ట్‌ కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది మరి! ఇవన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం. దీని ధర, ఫైనల్‌ ఫీచర్స్‌, లాంచ్‌ డిటెయిల్స్‌ను లంబోర్ఘిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.