Revanth Reddy Meets Ex-Maoist Leaders : మావోయిస్టు అగ్రనేతలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కేసులు, పునరావాస ప్యాకేజీలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Feb 27, 2026, 6:21 pm IST
Read Time: 3 mins
Revanth Reddy Meets Ex-Maoist Leaders : మావోయిస్టు అగ్రనేతలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ

విధాత, హైదరాబాద్ : ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. సీఎంతో సమావేశమైన వారిలో మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి(దేవ్ జీ), మల్ల రాజిరెడ్డి(సంగ్రామ్), పుల్లూరి ప్రసాదరావు(చంద్రన్న), పోతుల కల్పన(సుజాత), బడే చొక్కారావు (దామోదర్), నూనె నర్సింహా రెడ్డి (గంగన్న)లు ఉన్నారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీ ఇంటలీజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతిలు కూడా హాజరయ్యారు. గంటన్నర పాటు జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి, దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి, దామోదర్, చంద్రన్న, నూనె నరసింహరెడ్డిలకు మధ్య రాజకీయ ఎజెండాపైన, కేసులు, పునరావస ప్యాకేజీలపైన చర్చ సాగినట్లుగా సమాచారం. ఈ సందర్బంగా తమ లొంగుబాటు సహకరించిన సీఎంకు, అధికారులకు మావోయిస్టు నేతలు ధన్యవాదాలు తెలిపారని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు పాలసీ బాగుందని దేవ్ జీ ప్రశంసించారని తెలిసింది.

ఇవి కూడా చదవండి :

Chilkur Balaji Temple : చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్ కన్నుమూత
TVK Cheif Vijay : టీవీకే చీఫ్ విజయ్ కి బిగ్ షాక్