TVK Cheif Vijay : టీవీకే చీఫ్ విజయ్ కి బిగ్ షాక్

టీవీకే చీఫ్ విజయ్‌కు షాక్. భార్య సంగీత విడాకుల కోసం కోర్టు ఆశ్రయించింది. వివాహేతర సంబంధాల ఆరోపణలు తమిళనాట సంచలనంగా మారాయి.

TVK Cheif Vijay : టీవీకే చీఫ్ విజయ్ కి బిగ్ షాక్

విధాత: తమిళనాడు రాజకీయ నయా సంచలనంగా మారిన టీవీకే చీఫ్, సినీ హీరో విజయ్ కి అనూహ్య షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు కోరుతో భార్య సంగీత చంగల్ పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అతడి వివాహేతర సంబంధమే విడాకులు కోరడానికి కారణం అని సంగీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. 1999లో విజయ్, సంగీతలు వివాహం చేసుకున్నారు. వారికి కొడుకు, కూతురు ఉన్నారు. సంగీత ఎక్కువగా పిల్లలతో కలిసి లండన్ లో ఉంటున్నారు. సంగీత పిటిషన్ నేపథ్యంలో ఏప్రిల్ 20న కోర్టుకు హాజరుకావాలని ఫ్యామిలీ కోర్టు విజయ్ కి నోటీసులు జారీ చేసింది.

2021నుంచి విజయ్ తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని, ఆయనకు ఓ హీరోయిన్ తో, అలాగే పలువురు నటిమణులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, దీంతో ఆయన మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని సంగీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఐదేళ్ల కిందటే మేం మానసికంగా విడిపోయాం. అని, విజయ్ కి ఆ సినీ నటితో వివాహేతర సంబంధం ఉంది అని,  విజయ్ ఆ నటితో విదేశాలకు, పార్టీలకు వెళ్తారు అని సంగీత పేర్కొంది.  విజయ్ వేధింపులు కొనసాగితే ఆ నటి పేరు బయట పెడతానని,  విజయ్ వివాహేతర సంబంధం ఒక ద్రోహం అని సంగీత మండిపడింది.

ఇటీవల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ….విజయ్ పై విమర్శలు చేసే క్రమంలో విజయ్ రాజకీయాల్లో గెలవాలంటే ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత నెలకొనడంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఇంతలోనే విజయ్ భార్య అదే తరహా అరోపణలతో విడాకులు కోరుతు కోర్టుకెక్కడం తమిళనాట సంచలనంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయ్ పై ఆయన భార్య కోర్టు కెక్కడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి :

Quintuplets : ఒకే కాన్పులో.. ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన చైనా మహిళ!
Type-2 Diabetes | స్టెమ్ సెల్ థెరపీతో టైప్–2 డయాబెటిస్‌ రివర్స్‌.. చైనా కీలక ఆవిష్కరణ