దిగొచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళానికి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తెరదించారు. గురువారం ప్రభుత్వ ఏర్పాటు విషయంతో గవర్నర్ తో రెండో సారి విజయ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీలో బలనిరూపణ విషయమై విజయ్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

దిగొచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళానికి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తెరదించారు. గురువారం ప్రభుత్వ ఏర్పాటు విషయంతో గవర్నర్ తో రెండో సారి విజయ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అతిపెద్ద పార్టీగా ప్రజా తీర్పు పొందిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తే..అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని విజయ్ మరోసారి గవర్నర్ కు వివరించారు. రెండో భేటీలో తను ఏ విధంగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోబోతున్నానన్న అంశంపై  గవర్నర్ సంతృప్తి చెందేలా విజయ్ వివరణ ఇచ్చారని..దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.  భేటీ సందర్భంగా మెజార్టీ నిరూపణకు సంబంధించి గవర్నర్ సంధించిన ప్రశ్నలకు విజయ్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారని, దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సానుకూలత తెలిపారని తెలుస్తుంది.

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం.  ప్రస్తుతం టీవీకేకు 108మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విజయ్ బల నిరూపణలో ఒక ఓటు మాత్రమే వేస్తారు. దీంతో ఆ పార్టీ సంఖ్యాబలం 107గా ఉండనుంది. కాంగ్రెస్ 5 గురు ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించింది. మరో 6గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ప్రజాందోళనల నేపథ్యంలోనే గవర్నర్ నిర్ణయం

విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటుకు అహ్వానించే విషయంలో గవర్నర్ సానుకూలత వ్యక్తం చేయడం వెనుక విజయ్ కి ఉన్న ప్రజల మద్దతు బలంగా పనిచేసిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల ఫలితాలలో విజయ్ పట్ల జనాదరణ స్పష్టమైన నేపథ్యంలో.. ఎమ్మెల్యేల సంఖ్యాబలం సాకుగా ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటే ప్రజల్లో వ్యతిరేకత రావచ్చన్న నివేదికల మేరకు కేంద్రం సూచనలతో గవర్నర్ విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? రాష్ట్రపతిపాలనా?
దిగొచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్