Site icon vidhaatha

Minister Gangula Kamalakar | బొత్స వ్యాఖ్యలపై మంత్రులు గంగుల, శ్రీనివాస్‌గౌడ్‌ల ఫైర్‌

Minister Gangula Kamalakar

విధాత: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్ , శ్రీనివాస్‌గౌడ్‌లు ఫైర్‌ అయ్యారు. గంగుల స్పందిస్తు ఏపీలో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారని, కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా బొత్స చెప్పాలన్నారు.

ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఏపీపీఎస్సీ సభ్యులే వసూళ్లు చేసి ఉద్యోగాలిస్తున్నారని, మంత్రి బొత్స వీటన్నింటిపై సాయంత్రంలోపు స్పందించాలని, వాటిపై స్పందించాకే బొత్స హైదరాబాద్ లో అడుగుపెట్టాలన్నారు.

బొత్స వ్యాఖ్యల వెనక జగన్ ప్రభుత్వం లేకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. బొత్సను వెంటనే బర్తరఫ్ చేసి చూపించాలన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగుపడిందని, టీఎస్‌పీఎస్సీలో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమేనని, తప్పు చేసినవారిని శిక్షిస్తున్నామని
గంగుల తెలిపారు.

బొత్స వ్యాఖ్యలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇస్తు ఆ రాష్ట్రమేంటో, మా రాష్ట్రమేంటో మాకు తెలియదా?.. రాజధాని కూడా లేని రాష్ట్రం అది.. బొత్స అలా మాట్లాడటం సరికాదంటు మండిపడ్డారు. గతంలో ఏపీపీఎస్సీలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్నారు

Exit mobile version