Minister Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి కళ్లు తిరిగి పడిపోయారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆమె నీరసించి పడిపోయారు. ఏమి తినకపోవడంతోనే మంత్రికి షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి. వెంటనే మంత్రి సురేఖ వ్యక్తిగత సిబ్బంది ఆమెకు ఆహారం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగాల్సిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆమె సచివాలయం కు వచ్చారు. ఈ క్రమంలోనే కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు.
కొండా సురేఖ అస్వస్థత సమాచారాన్ని తెలుసుకున్న సీఎఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.