Site icon vidhaatha

మేడారం జాతరకు నిధులివ్వండి: మంత్రి కొండా సురేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ వినతి


విధాత: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరీ చేయాలని కోరుతూ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కలిసి వినతి పత్రం అందించారు. 2024 సంవత్సరంలో జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి, యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని సురేఖ కోరారు. పనులు చేపట్టేందుకు బడ్జెట్ మంజూరు కోసం శాఖల వారీగా రూపొందించిన ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించారు.

Exit mobile version