విధాత: తెలంగాణ భవన్ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తనకు మోదీ, అమిత్ షా అప్పనంగా కాంట్రాక్ట్ కట్టబెట్టలేదని.. దమ్ముంటే దేవుడి మీద ప్రమాణం చేయాలని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి కేటీఆర్ మూడు సూచనలు చేశారు. రాజగోపాల్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి. నీకు బీజేపీ అప్పనంగా రాసిచ్చిన మాట వాస్తవం కాకపోతే.. కాంట్రాక్ట్‌ను వదులుకో. న్యాయ వ్యవస్థ మీద మాకు కొంత నమ్మకం ఉంది.
దమ్ముంటే ఆ పని చేయ్. నేను ఆ పని చేయను. వేల కోట్లు ఎలా వదులుకోవాలి అనుకుంటావా..? భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద బండి సంజయ్ నెత్తి మీద చేయి పెట్టి ప్రమాణం చేయ్. కాంట్రాక్ట్‌తో సంబంధం లేదని ఈ గుండు సాక్షిగా చెబుతున్నానని చెప్పు.
లేదా మేం కట్టిన యాదాద్రికి వచ్చి మోదీ మీద ప్రమాణం చేయ్. ఈ బఫూన్ గాళ్లతో కొట్లాడటం పెద్ద కష్టమేం కాదు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలతోనే కొట్లాడినొళ్లం.. వీళ్లతోనే ఏం కాదు. మునుగోడు యుద్ధంలో డబ్బులతో నాయకులను కొంటున్నారు. మనం నమ్ముకోవాల్సింది కేవలం ప్రజలను మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు.