Site icon vidhaatha

Himanshu | హిమాన్షు పాట‌కు కేటీఆర్ ఫిదా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Himanshu | బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు త‌న‌లోని ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి తెలియ‌జేశాడు. కేవ‌లం చ‌దువుల‌కే ప‌రిమితం కాకుండా.. హిమాన్షు అప్పుడ‌ప్పుడు సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు. తాజాగా త‌న గొంతుతో ఓ ఇంగ్లీష్ సాంగ్ ఆల‌పించి, అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. తాను పాడిన ఆ పాట‌ను హిమాన్షు యూట్యూట్, ఇత‌ర సామాజిక మాధ్య‌మాల ద్వారా పంచుకున్నారు.

ప్ర‌సిద్ధ ఇంగ్లీష్ సాంగ్ గోల్డెన్ అవ‌ర్ పాట‌కు క‌వ‌ర్ సాంగ్‌ను హిమాన్షు పాడారు. ఈ వీడియోను కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. త‌న‌యుడి పాట‌కు కేటీఆర్ ఫిదా అయిపోయారు. గ‌ర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. హిమాన్షు ఆల‌పించిన ఈ పాట త‌న‌కెంతో న‌చ్చింది.. మీకు కూడా న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

హిమాన్షు పాట‌పై ఎమ్మెల్సీ క‌విత కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. నిన్ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను అల్లుడూ.. మ‌రిన్ని పాట‌లు నీ నుంచి ఆశిస్తున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలి అని కోరుకుంటూ క‌విత ట్వీట్ చేశారు.

Exit mobile version