Minister Satyavathi |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి సత్యవతి ఆశీస్సులు పొందుతున్నారు. ఇందులో ఎమ్మెల్సీ, సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా ఉండడం చర్చనీయాంశంగా మారంది.
తెలుగుదేశం పార్టీ హవాలో సత్యవతి… కడియానికి శిష్యురాలిస్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఆమె మంత్రిగా, కడియం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమెను కలిసిన వారిలో కడియంతో పాటు, మానుకోట, ములుగు, వరంగల్ తూర్పు, వైరా, ఖానాపూర్ అభ్యర్థులు శంకర్ నాయక్, నన్నపునేని నరేందర్, మదన్ లాల్, జాన్సన్ రాథోడ్, బడే నాగజ్యోతి ఉన్నారు.
నాగజ్యోతికి రూ.3.50 లక్షల చెక్కు అందజేసి దీవించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి, సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండగా, అభ్యర్థులు మరో మంత్రి సత్యవతి రాథోడ్ ఆశీస్సులు పొందడం యాధృచ్ఛికంగా జరిగిందా? లేదా ప్రేమతో ఆమె ఆశీస్సులు పొందారా? అన్నది ఆసక్తిగా మారింది.