Kadiyam Srihari | రాజయ్య, రాజేశ్వర్ రెడ్డి తోడు దొంగలు

ఓ దొంగ తాటికొండ రాజయ్య.. మరో దొంగ పట్లా రాజేశ్వర్ రెడ్డి.... ఇద్దరూ తోడుదొంగలు...ఈ తోడుదొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కడయం శ్రీహరి నిప్పులు చెరిగారు.

  • Publish Date - April 17, 2024 / 04:31 PM IST

కమీషన్లతో అక్రమ సంపాదన
వందలకోట్లు వెనుకేసుకున్న పల్లా
విచ్చలవిడి భూ కబ్జాలు చేపట్టారు
ఎమ్మెల్యేగా రాజీనామాకు సవాల్
ఎమ్మెల్యే కడియం

విధాత, వరంగల్ ప్రతినిధి: ఓ దొంగ తాటికొండ రాజయ్య.. మరో దొంగ పట్లా రాజేశ్వర్ రెడ్డి…. ఇద్దరూ తోడుదొంగలు…ఈ తోడుదొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కడయం శ్రీహరి నిప్పులు చెరిగారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వీరిద్ధరూ గత ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా కోట్లు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవినీతికి పాల్పడ్డట్టూ విమర్శిస్తున్న వీరిద్ధరు వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. నీ అవినీతిని నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేసేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.

కడియం బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒంటికాలుపై లేస్తున్నారు. కడియం శ్రీహరి అవినీతిపరుడంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కూడా తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీలో చేరగానే కడియం టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ సంపాదనను హవాలా రూపంలో విదేశాల్లో దాచుకున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. వీటన్నింటికి కడియం బుధవారం కౌంటరిస్తూ సవాల్ విసిరారు.

జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై, పనిలో పనిగా రాజయ్య పై శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని.. వందల కోట్లు సంపాదించిన వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ విమర్శించారు.

పల్లాకు వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి రాదన్నారు. మనబడి మన ప్రణాళికలో సొంత తమ్ముడికి పల్లా కాంట్రాక్టు ఇప్పించారని విమర్శించారు. మనబడి మన ప్రణాళికలో తన తమ్ముడు చేపట్టిన పనుల్లో అక్రమాలు జరిగినందున కేసు నమోదయ్యిందని విమర్శించారు. పల్లా భూ కబ్జాలు చేశాడని కేసు కూడా నమోదయ్యిందని గుర్తుచేశారు. రూ.104 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ల పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్ వద్ద కమిషన్ తీసుకున్న వ్యక్తివి నీవంటూ పల్లాను విమర్శించారు. దళిత బందులో రాజయ్య, లిఫ్ట్ ఇరిగేషన్లలో నువ్వు కమీషన్లకు కక్కుర్తిపడ్డది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.

నీవు కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే.. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావని అంటూ పల్లాకు కడియం సవాల్ విసిరారు. అదే లిఫ్ట్ ఇరిగేషన్ లో నేను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ కడియం ప్రకటించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు నీ బ్రతుకంతా నాకు తెలుసంటూ హెచ్చరించారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేదా? అంటూ నిలదీశారు.

Latest News