Site icon vidhaatha

నాటి కేసీఆర్ వ్యాఖ్యలే నేడు ఆయనకు రిటన్ గిప్ట్

విధాత వనపర్తి బ్యూరో: గతంలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన రండ మాటలను నేడు రిటన్ గిప్ట్ ఇస్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల తో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన   మండిపడ్డారు. పదేళ్ల బీఆరెస్‌ పాలనలో రండ మాటలు నేర్పింది కేసీఆర్ కదా అని ఆయన ప్రశ్నించారు. 


అలాంటి రండ మాటలు నేడు రిటన్ గిఫ్ట్‌గా ఇస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపైన  అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆరెస్‌  నాయకులు రోడ్లపై తిరిగేందుకు కూడా ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదని, మాజీ మంత్రి పక్కనే ఉండి బాల్క సుమన్‌తో  మాట్లాడించారన్నారు. రానున్న రోజుల్లో బీఆరెస్‌ పార్టీ పూర్తిగా ఖాళీ అవబోతుందని, నాయకులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు.


పెబ్బేరు జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


పెబ్బేరు పట్టణంలో ఈనెల 11,12 న  చౌడమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆయన ఆదేశించారు. రోడ్ల విస్తరణలో  నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా అక్రమణకు గురైన పభుత్వ భూముల విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. పెబ్బేరు లో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు.


ఇటీవల  కొత్తగా స్టాప్ నర్సులు నియమితులైన వారిని ఎమ్మెల్యే సన్మానించారు. అదే విధంగా ఆయన పెబ్బేరు బస్టాండ్ ను పరిశీలించారు. బస్టాండ్ అవరణలో సీసీ వేయించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్  సంచిత్ గంగ్వార్, మున్సిపల్ కమీషనర్ ఆదిశేషు, అధికారులు, మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నా యకులు, కార్యకర్తలు ఉన్నారు.

Exit mobile version