Site icon vidhaatha

Rajasingh | బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలకు గుడ్ బై: ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh | విధాత, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్‌ ఇవ్వకుంటే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్రంగా లేదా, ఇతర పార్టీల నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్యులర్‌ పార్టీల్లోకి వెళ్లనని తెలిపారు. ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరనని అన్నారు. గోషామహల్‌ బీఆర్ఎస్ టికెట్‌ మజ్లిస్‌ చేతిలో ఉందన్నారు. మజ్లిస్‌ నిర్ణయం కోసమే గోషామహల్‌ స్థానాన్ని కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. బీజేపీ అధిష్ఠానం తనపై సానుకూలంగా ఉందని, సరైన సమయంలో తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు

Exit mobile version