MLC Kavitha | ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ 22కు వాయిదా

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. ఈడీ అరెస్టు చేసిన కేసులో ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు

  • Publish Date - April 16, 2024 / 02:24 PM IST

అదే రోజు సీబీఐ కేసు బెయిల్ విచారణ

విధాత, హైదరాబాద్‌ : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. ఈడీ అరెస్టు చేసిన కేసులో ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంగళవారం దీనిపై విచారణ జరుగాల్సివుంది. జడ్జీ సెలవులో ఉండటంతో విచారణను కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. అటు సీబీఐ కేసులోనూ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సైతం ఈనెల 22న విచారణకు రానుంది. ప్రస్తుతం కవిత ఏప్రిల్ 23వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ కేసులో సహా నిందితులకు ఇచ్చినట్లుగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.

Latest News