Site icon vidhaatha

చాక్ పీస్‌లతో భద్రాచలం ఆలయ నమూనా.. రాజేందర్ క‌ళానైపుణ్యం

విధాత బ్యూరో, కరీంనగర్: శ్రీరామనవమి పురస్కరించుకుని పెద్డపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజనీకాంత్ చాక్ పీస్ పై 3 సెంటీమీటర్ల ఎత్తు 7 సెంటీమీటర్ల వెడల్పుతో భద్రాచల రాముని ఆలయాన్ని తీర్చిదిద్దారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రజినీకాంత్ శ్రీరామనవమి పురస్కరించుకొని నాలుగు గంటల పాటు శ్రమించి రాముల వారి ఆలయ నమూనాకు రూపం ఇచ్చారు.

గుండుపిన్నుల‌ సహాయంతో చాక్ పీస్‌లను ఉపయోగించి భద్రాచల ఆలయ నమూనా రూపొందించి తనకున్న రామ భక్తిని చాటుకున్నాడు. గర్భగుడి ఎత్తు 1.5 సెంటీమీటర్లు, చుట్టూ మూడు గోపురాల ఎత్తు 1.5 సెంటీమీటర్లు, ప్రధాన గోపురం ఎత్తు 3 సెంటీమీటర్లలో చెక్కి తన భక్తిని చాటాడు.

Exit mobile version