MP Asaduddin
విధాత : చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును ఎంఐఎం వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్ధిన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఓబీసీలకు, ముస్లిం మహిళలకు రిజర్వేషన్లు కల్పించనందుకే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు.
ప్రాతినిధ్యం లేని వారికి ప్రాతినిధ్యం కల్పించాలని, ముస్లిం మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం ఈ బిల్లులో ప్రధాన లోపమన్నారు. బిల్లుకు చట్టరూపం ఇచ్చే ముందు ముస్లిం మహిళలకు రిజర్వేషన్ల అంశం పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.