Mutton Fry Biryani | మ‌ట‌న్ ఫ్రై బిర్యానీ ఇలా ట్రై చేయండి.. ఎంతో రుచిక‌రంగా ఉంటుంది..

Mutton Fry Biryani | నాన్ వెజ్ ప్రియులు.. మ‌ట‌న్ పేరు విన‌గానే లొట్ట‌లేసుకుంటారు. రెగ్యుల‌ర్‌గా మ‌ట‌న్ క‌ర్రీ, మ‌ట‌న్ బిర్యానీ తిని బోరుగా ఫీలయ్యే వారు.. ఇదే మ‌ట‌న్‌తో కొత్త‌గా ట్రై చేయొచ్చు. అదేంటంటే మ‌ట‌న్ ఫ్రై బిర్యానీ. ఈ వంట‌కాన్ని చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. శ్ర‌ద్ధ పెట్టి చేసామంటే.. ఈ బిర్యాన్నీ ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. మ‌రి మ‌ట‌న్ ఫ్రై బిర్యానీని ఎలా త‌యారు చేస్తారో తెలుసుకుందాం. మ‌ట‌న్ ఫ్రైకి కావాల్సిన ప‌దార్థాలు.. […]

  • Publish Date - July 9, 2023 / 08:18 AM IST

Mutton Fry Biryani |

నాన్ వెజ్ ప్రియులు.. మ‌ట‌న్ పేరు విన‌గానే లొట్ట‌లేసుకుంటారు. రెగ్యుల‌ర్‌గా మ‌ట‌న్ క‌ర్రీ, మ‌ట‌న్ బిర్యానీ తిని బోరుగా ఫీలయ్యే వారు.. ఇదే మ‌ట‌న్‌తో కొత్త‌గా ట్రై చేయొచ్చు. అదేంటంటే మ‌ట‌న్ ఫ్రై బిర్యానీ. ఈ వంట‌కాన్ని చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. శ్ర‌ద్ధ పెట్టి చేసామంటే.. ఈ బిర్యాన్నీ ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. మ‌రి మ‌ట‌న్ ఫ్రై బిర్యానీని ఎలా త‌యారు చేస్తారో తెలుసుకుందాం.

మ‌ట‌న్ ఫ్రైకి కావాల్సిన ప‌దార్థాలు..

అర‌కిలో మ‌ట‌న్, మూడు ల‌వంగాలు, మూడు యాల‌కులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క‌, ఒక టీ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ ప‌సుపు, త‌గినంత ఉప్పు, ట‌మాటా, క‌సూరి మెంతి, కొత్తిమీర‌, పుదీనా, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మాసాలా, క‌రివేపాకు.

అన్నం త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు..

ఒక గ్లాస్ బాస్మ‌తీ రైస్, త‌గినంత నూనె, సాజీరా, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, కొద్దిగా స్టోన్ ఫ్ల‌వ‌ర్, త‌రిగిన ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్, త‌రిగిన కొత్త‌మీర‌, పుదీనా, త‌గినంత ఉప్పు, రెండు గ్లాసుల నీళ్లు, ఒక టీ స్పూన్ నెయ్యి.

బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా మ‌ట‌న్‌ను శుభ్రంగా క‌డ‌గాలి. కుక్క‌ర్‌లో మ‌ట‌న్ వేసి.. మ‌సాలా ప‌దార్థాలు, నీళ్లు, ఉప్పు, కారం, ప‌సుపు, అల్లం పేస్ట్ వేసి మూత‌పెట్టాలి. 6 నుంచి 7 విజిల్స్ వ‌చ్చాక స్ట‌వ్ ఆఫ్ చేయాలి. మ‌ట‌న్ మెత్త‌గా ఉడికిన త‌ర్వాత దాన్ని ఓ పాత్ర‌లో ఉంచుకోవాలి. ఇక అన్నం త‌యారీకి ఓ పాత్ర‌లో నూనె వేసి వేడి చేయాలి. అనంత‌రం మాసాలా దినుసులు వేసి దోర‌గా వేయించాలి.

ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌ర్వాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌ర్వాత పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. ఒక నిమిషం పాటు వేయించిన త‌ర్వాత ఆ ద్రావ‌ణంలో బియ్యం వేసి క‌ల‌పాలి. దీనికి నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి క‌ల‌పాలి. ఆ త‌ర్వాత మూత‌పెట్టి ఉడికించాలి. కాసేటికి అన్నం ఉడ‌క‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇక ముందుగానే ఉడికించిన మ‌ట‌న్‌కు ఉప్పు, కారం, ధ‌నియాలపొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా, క‌సూరి మెంతి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మ‌ట‌న్ ఫ్రైను ముందుగా త‌యారు చేసుకున్న పులావ్ అన్నంతో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఫ్రై బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఈ మ‌ట‌న్ ఫ్రై బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Latest News